Hyderabad: హైదరాబాద్ లోని ఈ ఏరియాలో ఫుల్లు రైన్

Hyderabad: రోజంతా మండిపడిన ఎండ, ఉక్కపోతతో అల్లాడిపోయిన భాగ్యనగర వాసులకు మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం కొంత ఉపశమనాన్నిచ్చింది. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలువలేదు. అరగంటపాటు దంచికొట్టిన కుండపోత వానతో నగరం అతలాకుతలమైంది. పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమై జనజీవనం స్తంభించింది.

నగరంలోని కోఠి, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, హిమాయత్‌నగర్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, రాజేంద్రనగర్, గండిపేట్ వంటి ప్రధాన ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. రోడ్లు చెరువుల్లా మారిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ప్రజలు రోడ్లపై నిలిచిపోయారు.

ప్రత్యేకంగా కార్యాలయ సమయాల్లో వర్షం పడటంతో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. పలు రహదారులపై వాహనాలు కదలిక లేకుండా నిలిచిపోవడంతో ప్రజలు గంటల తరబడి ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

మరోవైపు, గచ్చిబౌలి, రాయదుర్గం, పంజాగుట్ట, అమీర్‌పేట్, చార్మినార్, ఫలక్‌నుమా ప్రాంతాల్లో మాత్రం ఓ మోస్తరు వర్షం మాత్రమే నమోదైంది. మొత్తం మీద, అరగంటపాటు కురిసిన వాన నగరాన్ని అక్షరాలా స్తంభింపజేసింది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *