Hyderabad: గ్రూప్-1 నియామకాలపై స్టే..సుప్రీంకోర్టు తిరస్కరించింది

Hyderabad: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. గ్రూప్-1 నియామకాలపై స్టే విధించాలన్న అభ్యర్థుల విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినందున, ఈ దశలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చే తుది ఉత్తర్వులకు అనుగుణంగా నియామకాలు కొనసాగాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రభుత్వానికి తాత్కాలికంగా ఊరట లభించింది.

గ్రూప్-1 నియామకాలపై ఇటీవల హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో, పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎంపికైన వారికి నియామక పత్రాలు ఇవ్వడాన్ని నిలిపివేయాలని (స్టే ఇవ్వాలని) వారు విజ్ఞప్తి చేశారు.

అయితే, సుప్రీంకోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న నియామక ప్రక్రియ కొనసాగడానికి మార్గం సుగమమైంది. హైకోర్టు తుది తీర్పు వచ్చే వరకు నియామకాలు ఆ ఉత్తర్వులకే అనుగుణంగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *