Himachal: బిలాస్‌పూర్ జిల్లాలో టూరిస్ట్ బస్సుపై అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడి పడటంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ విషాద ఘటనలో కనీసం 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
ఇంకా పలువురు తీవ్రంగా గాయపడ్డారు, వారిని సమీపంలోని బిలాస్‌పూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు తరచూ విరిగిపడుతున్నాయని, రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు తెలిపాయి.
ప్రస్తుతం రహదారి మూసివేయబడింది, ట్రాఫిక్ నిలిచిపోయింది. అధికారులు పర్యటిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.