Irfan Pathan: ఇటీవల రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి, శుభ్‌మన్ గిల్‌కు బాధ్యతలు అప్పగించడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయాన్ని మాజీ క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు. 2027 వన్డే ప్రపంచ కప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడాలనుకుంటే, వారికి నిరంతరం మ్యాచ్ ప్రాక్టీస్ ఉండటం చాలా ముఖ్యమని భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే, వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్‌ను తప్పించడం, ఆటగాళ్ల వయస్సు పెరుగుతుండడం వంటి నేపథ్యంలో, భవిష్యత్తులో వారికి తగినన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం లభించడం అతి పెద్ద సవాలుగా మారవచ్చు.‘రోహిత్ తన ఫిట్‌నెస్‌పై బాగా పనిచేశాడు. అతడు దానిపైనే దృష్టి పెట్టాడు.
ఇది కూడా చదవండి: Sacramento: అమెరికా కాలిఫోర్నియాలో ఘోర ప్రమాదం
రెగ్యులర్ క్రికెట్ ఆడకపోతే కొంత ఆట సమయాన్ని కేటాయించుకని దేశవాళీ క్రికెట్ ఆడాలి. రోహిత్, కోహ్లీ పెద్ద ఆటగాళ్లు. ఎంతో అనుభవం ఉంది. ఏం చేయాలో వారికి తెలుసు. కానీ, సమస్య ఏంటంటే వారిద్దరూ టీ20లు కూడా ఆడటం లేదు. ప్రపంచ కప్‌కు ముందు భారత్ కొన్ని వన్డేలే ఆడనుంది. ఆ మ్యాచ్‌లకు టోర్నీ ఆరంభానికి మధ్య చాలా విరామం ఉంది. వరల్డ్ కప్ కోసం ఫిట్‌గా ఉండటానికి వారు క్రమం తప్పకుండా మ్యాచ్‌లు ఆడటం అవసరం. అప్పుడే 2027 ప్రపంచ కప్ ఆడాలనే రోహిత్, కోహ్లీ కల నెరవేరుతుంది’ అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. మరోవైపు శుభ్‌మన్ గిల్‌కు బాధ్యతలు అప్పగించడాన్ని చాలా మంది స్వాగతించారు. అతను యువ కెప్టెన్సీకి సరైన వ్యక్తి అని, అన్ని ఫార్మాట్లలో మంచి ఫామ్‌లో ఉన్నాడని అభిప్రాయపడుతున్నారు. అతని నాయకత్వంలో జట్టు ఎలా రాణిస్తుందో చూడాలి.