Bernard Julien: 1975లో తొలి వన్డే ప్రపంచ కప్ గెలిచిన వెస్టిండీస్ జట్టులో భాగమైన బెర్నార్డ్ జూలియన్ 75 సంవత్సరాల వయసులో మరణించారు. ఆల్ రౌండర్ అయిన జూలియన్ ఎడమచేతి వాటం పేస్ బౌలింగ్ చేసి 1973 నుండి 1977 వరకు 24 టెస్టులు, 12 వన్డేలలో వెస్టిండీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. జూలియన్ టెస్ట్ క్రికెట్‌లో రెండు సెంచరీలతో సహా 866 పరుగులు చేశాడు. 50 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో, అతను 18 వికెట్లతో పాటు 86 పరుగులు చేశాడు. 1975, 1979లో విండీస్ తొలి రెండు వన్డే ప్రపంచ కప్‌లను గెలుచుకున్నప్పుడు ఆ జట్టు కెప్టెన్‌గా ఉన్న క్లైవ్ లాయిడ్, జూలియన్‌కు ఘనంగా నివాళులర్పించారు.
ఇది కూడా చదవండి: T20I Series: భారత్ తో పోటీ.. ఆస్ట్రేలియా వన్డే, T20 సిరీస్ జట్ల ప్రకటన!
1975 ప్రపంచ కప్‌ను వెస్టిండీస్ గెలవడంలో జూలియన్ కీలక పాత్ర పోషించాడు. గ్రూప్ మ్యాచ్‌లో శ్రీలంకపై 4/20, సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 4/27తో అతను బంతితో కీలక ప్రదర్శన ఇచ్చాడు. బ్యాటింగ్‌తో, ఆస్ట్రేలియాతో జరిగిన టైటిల్ పోరులో అతను 37 బంతుల్లో 26 పరుగులు చేశాడు, వెస్టిండీస్ 17 పరుగుల తేడాతో గెలిచింది. ఆయన మరణం పట్ల క్రికెట్ వెస్టిండీస్ అధ్యక్షుడు కిషోర్ షాలో, దిగ్గజ కెప్టెన్ సర్ క్లైవ్ లాయిడ్ తో పాటు పలువురు క్రికెట్ ప్రముఖులు సంతాపం తెలిపారు. “బెర్నార్డ్ జూలియన్ మరణం నన్ను తీవ్రంగా కలిచివేసింది. విండీస్ గొప్ప క్రికెటర్లలో జూలియన్ ఒకరు. ఆయన సుదీర్ఘ కాలం పాటు విండీస్ క్రికెట్‌కు తన సేవలను అందించాడు. విండీస్ క్రికెట్ చరిత్రలోనే ఆయన చిరస్మరణీయంగా నిలిపోతారు అని తెలిపారు.