Adluri Laxman: మంత్రి అడ్డూరి లక్ష్మణ్‌కుమార్‌పై రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యల ఎపిసోడ్ ఇంకా సమసిపోలేదు. మంత్రి పొన్నంపై అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ రగిలిపోతున్నారు. మీడియా సమావేశంలో ఆయన తనపై చులకన చేసిన మాట్లాడిన తీరుపై మండిపడుతున్నారు. ఆ అంశంపై తాను తాడోపేడో తేల్చుకుంటానని అల్టిమేటం జారీ చేశారు. అధిష్టానం వద్దకు వెళ్తానని చెప్పారు.
Adluri Laxman: జూబ్లీహిల్స్‌లో జరిగిన ఓ మీడియా సమావేశం ప్రారంభానికి ముందు మరో మంత్రి అయిన అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆలస్యం చేశాడనే ఉద్దేశంతో మరో మంత్రి అయిన వివేక్ చెవులో చెప్తూ నోరుజారాడు. అప్పటికే మైక్‌లు ఆన్‌చేసి ఉండటంతో అది కాస్తా బహిరంగంగా వినిపించింది. ఈ విషయం వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కూడా సీరియస్ అయినట్టు తెలిసింది.
Adluri Laxman: ఈ అంశంపై తాజాగా అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ స్పందించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తనను అవమానించడమే కాదని, తన జాతిని కూడా అవమానించినట్టేనని మంత్రి అడ్లూరి పేర్కొన్నారు. తాను మంత్రిని కావడం, మా సామాజిక వర్గంలో పుట్టడం తన తప్పా అని ఆవేదన వ్యక్తంచేశారు. పొన్నం ప్రభాకర్ తన తప్పును తెలుసుకొని క్షమాపణలు చెప్పాలని అడ్లూరి డిమాండ్ చేశారు.
Adluri Laxman: పొన్నం ప్రభాకర్‌లాగా అహంకారంగా మాట్లాడటం తనకు రాదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ స్పష్టంచేశారు. పొన్నం ఇకనైనా మారకపోతే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలని హెచ్చరించారు. దీనిపై తాను కాంగ్రెస్ అగ్రనైతలైన సోనియాగాంధీ, రాహుల్‌గాందీ, మల్లికార్జున ఖర్గే, మీనాక్షి నటరాజన్‌ను కలుస్తానని చెప్పారు.
Adluri Laxman: ఇదే సమయంలో మరో మంత్రి వివేక్ వెంకటస్వామి గురించి కూడా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పక్కన ఉంటే మంత్రి వివేక్ ఓర్చుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. తాను కుర్చీలో కూర్చుంటే వివేక్ లేచి వెళ్లిపోతున్నారని తెలిపారు. సహచర మంత్రిని అంతమాట అన్నా వివేక్ చూస్తూ ఊరకుండిపోయాడే కానీ, వారించలేకపోయారని తెలిపారు.