Election Commission:కేంద్రం ఎన్నికల సంఘం నూతనంగా 17 సంస్కరణలను తీసుకొ్చ్చింది. బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన వేళ.. ఈ నూతన మార్పులను తీసుకువచ్చింది. పోలింగ్ సందర్భంగా అమలు చేసే ఈ సంచలన అంశాలు ఓటర్లకు మేలు కలిగించేవిగా ఎన్నికల సంఘం అభివర్ణించింది. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు పడవద్దని, పోలింగ్‌లో ఆలస్యం కావద్దని ఈ నూతన సంస్కరణలను తీసుకొ్చినట్టు అధికారులు తెలిపారు.
17 ఎన్నికల సంస్కరణలు ఇవే..
1) ఓటరుగా నమోదైన తర్వాత ఆ ఓటరుకు 15 రోజుల్లోగానే ఓటరు కార్డును చేరుస్తుంది.
2) పోలింగ్ స్టేషన్ల వద్ద మొబైల్ డిపాజిట్ కౌంటర్ల ఏర్పాటు
3) ప్రతి బూత్‌లో ఓటర్ల సంఖ్యను 1,500 నుంచి 1,200కు తగ్గింపు
4) ఈవీఎంలపై అభ్యర్థి కలర్ ఫొటోను ఉంచాలి. పెద్ద సైజులో అభ్యర్థి పేరున్న అక్షరాలు
5) పోలింగ్ బూత్ అధికారి తప్పకుండా అధికారిక ఐడీ కార్డుతో ఉంటారు.
6) ప్రతి బూత్‌లో 100 శాతం వెబ్ కాస్టింగ్ ఉంటుంది.
7) బూత్ లెవల్ ఏజెంట్లు అందరికీ ముందుగానే శిక్షణ ఇవ్వాలి.
8) బూత్ ఓట్ల లెక్కింపులో తేడాలు ఉంటే, అక్కడి వీవీ ప్యాట్లు కూడా లెక్కిస్తారు.
9) బీఎల్వోలు, బీఎల్వో సూపర్ వైజర్లకు ముందుస్తు శిక్షణ ఇవ్వాలి.
10) శాంతి భద్రతల నిర్వహణపై పోలీసులకు ముందుగానే సెషన్ నిర్వహిస్తారు.
11) అక్రమ ఓటర్లను తొలగించేలా ఎస్ఐఆర్ అమలు
12) పోలింగ్ సిబ్బంది రెమ్యునరేషన్ పెంపు
13) పోలింగ్ స్టేషన్‌ను సులువుగా గుర్తించేలా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ రీడిజైనింగ్
14) ఈసీఐకి గల 40 వేర్వేరు ప్లాట్‌ఫామ్‌లను ఈసీఐఎన్ఈటీ అనే సింగిల్ డెస్టినేషన్‌గా మార్పు
15) బూత్ నుంచి అభ్యర్థుల తరఫు వారి టేబుల్స్ దూరం 200 మీటర్ల నుంచి 100 మీటర్లకు తగ్గింపు
16) ఎన్నికల అనంతరం ఎంత మంది ఓటేశారు. వారిలో పురుషులు, మహిళలు, ఇతరులు ఎంతమంది అని తెలుసుకునేలా సైట్లో డిజిటల్ సూచికలను అందుబాటులో ఉంచుతుంది.
17) ఇప్పటి వరకూ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. ఇకపై ఈవీఎంలతో లెక్కింపును మొదలు పెడతారు. ఈవీఎంల చివరి రెండు రౌండ్ల లెక్కింపునకు ముందు పోస్టల్ ఓట్లను తెక్కిస్తారు.