BC Reservations: సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల అంశంపై ఈ రోజు (అక్టోబర్ 6న) విచారణ జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోనం.9ని తీసుకొచ్చింది. ఈ జీవోను రద్దు చేయాలని కోరుతూ వంగా గోపాల్‌రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించడాన్ని ఆయన న్యాయస్థానంలో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
BC Reservations: వంగా గోపాల్‌రెడ్డి పిటిషన్‌ను తొలుత విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు సోమవారం నాటికి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు సోమవారమైన అక్టోబర్ 6న విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్లు అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ్ దవే వాదించారు.
BC Reservations: ఈ మేరకు విచారణకు స్వీకరించిన కొద్దిసేపటికే వంగా గోపాల్‌రెడ్డి పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్టు న్యాయస్థాన ధర్మాసనం తెలిపింది. బీసీ రిజర్వేషన్ల అంశంపై దాఖలైన మరో పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నదని, అదే కోర్టులో ఈ అంశంపై తేల్చుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది.