Super Moon:సోమ, మంగళవారాల్లో ఖగోళ వింత కనువిందు చేయనున్నది. ఇది భారతదేశ పరిధిలోని ఆకాశంలో ఆ వింత మరింత శోభాయమానం కానున్నది. ఆ రెండురోజుల పాటు ఆకాశంలో సూపర్‌మూన్ ఆవిష్కృతం కానున్నది. భూమి చుట్టూ తిరుగుతూ కొన్నిసార్లు చంద్రుడు భూమి సమీపానికి వస్తుంటాడు. పౌర్ణమి రోజు కనిపించే చంద్రుడి కంటే అధికంగా చంద్రుడి సైజు, వెలుగు ఉండనున్నది.
Super Moon:ఈ రోజుల్లో చంద్రుడి సైజు 14 శాతం అధికంగా కనిపించనున్నది. అదే విధంగా పౌర్ణమి కంటే 30 శాతం అధిక వెలుగును ప్రసరించనున్నది. ఇది సంవత్సర త్రైమాసికానికి ముందురోజుల్లో ఈ సూపర్‌మూన్ కనిపిస్తుండటంతో దీనిని హార్వెస్ట్ మూన్ అని పిలుచుకుంటున్నారు. ఇదిలా ఉండగా, నవంబర్, డిసెంబర్ నెలల్లో కూడా రెండు సూపర్ మూన్‌లు ఏర్పడనున్నాయి.
Super Moon:ఈ సూపర్‌మూన్‌ను ఎలాంటి పరికరాలు లేకుండా చూడవచ్చని ఖగోళ పరిశోధకులు తెలిపారు. దీని వీక్షణ కోసం ఆకాశ వీక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా పరిస్థితుల్లో వాతావరణంలో మబ్బులు కమ్ముకుంటున్నాయి. ఒకవేళ మబ్బులు కమ్ముకోకుంటే చంద్రుడిని స్పష్టంగా వీక్షించవచ్చు. చంద్రుడు సంపూర్ణ కాంతిని వెదజల్లుతాడు.