Crime News: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మేరఠ్‌లో ప్రియుడి సాయంతో తన భర్తను ఓ మహిళ హత్యచేసిన ఘటనను మరువక ముందే అదే రాష్ట్రంలోని దేవాస్ జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే మరో ఘటన చోటుచేసుకున్నది. మానవ సంబంధాలు ఎంతగా కఠినంగా మారుతున్నాయో తెలిపేందుకు ఈ రెండు ఘటనలు నిదర్శనంగా నిలిచాయి. ఇప్పటికే ఇలాంటి ఘటనలు భారత సమాజంలో నిత్యకృత్యంగా మారడం ఆందోళన కలిగించకమానదు.
Crime News: దేవాస్ జిల్లాకు చెందిన లక్షిత చౌదరి (22) అనే యువతి కళాశాలకు అని ఇంటిలో చెప్పి వెళ్లింది. సాయంత్రమైనా తిరిగిరాలేదు. ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఎంతగా వెతికినా దొరకలేదు. దీంతో మరునాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ సమయంలో వారికి ఎలాంటి శ్రమ లేకుండానే నిందితుడే వచ్చి అసలు విషయాన్ని తేల్చి చెప్పాడు.
Crime News: పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన అదే ప్రాంతానికి చెందిన మోను అనే యువకుడు.. తానే లక్షిత చౌదరిని చంపేసినట్టు ఒప్పుకున్నాడు. తామిద్దరం ప్రేమించుకున్నామని, కానీ, ఇటీవల ఆమె మరో వ్యక్తితో బంధం పెట్టుకున్నదని, అందుకే ఆమెను హత్య చేసినట్టు మోను తెలిపాడు. ఆమె వేరొకరితో బంధం పెట్టుకొని తిరగడాన్ని తాను సహించలేకపోయానని తేల్చి చెప్పాడు.
Crime News: ఆ తర్వాత పోలీసులను తన ఇంటికి తీసుకెళ్లి లక్షిత చౌదరి మృతదేహాన్ని అప్పగించాడు. తన నివాసానికి వచ్చిన లక్షితను కాళ్లు, చేతులు కట్టేసి నీటితో నిండా ఉన్న బ్లూ డ్రమ్ములో ముంచి ఊపిరాడనీయకుండా చేసి హత్య చేసినట్టు మోను ఒప్పుకున్నాడు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న లక్షిత చౌదరి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.