Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 హౌస్‌లో ఎప్పటిలాగే డ్రామా, ఎమోషన్ మేళవింపుతో కొత్త ఎపిసోడ్ ప్రసారం అయింది. కెప్టెన్సీ టాస్క్‌లో కంటెస్టెంట్ల మధ్య చోటు చేసుకున్న సంఘటనలు ఈ సీజన్‌లోనే కాకుండా మొత్తం బిగ్‌బాస్ జర్నీలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా కళ్యాణ్‌ను రేస్ నుంచి తొలగించడంపై రీతూ-డీమాన్‌ల స్ట్రాటజీ హౌస్‌లో యుద్ధ వాతావరణం సృష్టించింది.
టాస్క్‌లో మలుపు – రీతూ-డీమాన్ గేమ్‌ప్లాన్
ఈ సారి కెప్టెన్సీ కోసం బిగ్‌బాస్ కాస్త విభిన్నమైన ‘రెయిన్ డ్యాన్స్ టాస్క్’ పెట్టాడు. మ్యూజిక్ వచ్చినప్పుడు ఇంటి సభ్యులు డ్యాన్స్ చేయాలి, అదే సమయంలో కంటెండర్స్ రెడ్ స్క్వేర్ నుంచి బ్లూ స్క్వేర్‌కి గొడుగును తీసుకెళ్లాలి. మ్యూజిక్ ఆగకముందే గొడుగు బ్లూ స్క్వేర్‌లో పెట్టకపోతే, డ్యాన్స్ చేస్తున్న సభ్యులకు కంటెండర్‌లను ఎలిమినేట్ చేసే అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి: National: దేశవ్యాప్త రైతులకు శుభవార్త..
ఇప్పటికే టాస్క్‌కి ముందు కళ్యాణ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కనిపించిన రీతూ, గేమ్ మొదలయ్యే సమయానికి తన స్ట్రాటజీని మార్చేసింది. “కళ్యాణ్ ఉంటే నాకు కెప్టెన్సీ రాదు” అంటూ డీమాన్ చెవిలో చెప్పింది రీతూ. డీమాన్ కూడా అదే దిశగా సాగి మొదటి రౌండ్‌లోనే కళ్యాణ్‌ని రేసు నుంచి తప్పించాడు. ఇది అసలు ఊహించని కళ్యాణ్‌కి షాక్ కి గురైయ్యాడు.
కళ్యాణ్ – నమ్మకం బొక్క పెట్టిన బాధ
“ఒకడి కష్టాన్ని దొబ్బడం కాదు.. నన్ను మోసం చేయలేదా.. ఇది మోసమే!” అంటూ రీతూ-డీమాన్‌లపై కళ్యాణ్ తీవ్రంగా స్పందించాడు. రీతూ ఎంతగా సారీ చెప్పినా కళ్యాణ్ మాత్రం అసలు తగ్గలేదు. “నువ్వు నాకు ఫ్రెండ్ కాదు.. మోసం చేసింది నువ్వే!” అంటూ స్పష్టంగా చెప్పి వెళ్ళిపోయాడు.
హౌస్‌లో ఈ ఎపిసోడ్ ఎమోషనల్ సీన్‌లతో నిండిపోయింది. రీతూ-డీమాన్ స్ట్రాటజీకి శ్రీజ కూడా సపోర్ట్‌గా ఉండటంతో కళ్యాణ్ ఇంకా ఎక్కువగా హర్ట్ అయ్యాడు.
ఫైనల్ రేస్ – రాము రాథోడ్ కెప్టెన్
చివరికి కెప్టెన్సీ రేస్‌లో రీతూ, రాము మాత్రమే మిగిలారు. భరణి రాముకి సపోర్ట్ చేయడంతో రీతూ ఎలిమినేట్ అయిపోయింది. దీంతో బిగ్‌బాస్ నాలుగో కెప్టెన్‌గా రాము రాథోడ్ ఎంపికయ్యాడు. తనే గెలుస్తాను అని అనుకున్న రీతూకి ఇది పెద్ద షాక్.
హౌస్‌లో వాదోపవాదాలు – మోసం చేశావా?
టాస్క్ అయిపోయాక కూడా హౌస్‌లో వాదోపవాదాలు కొనసాగాయి. “బెస్ట్ ఫ్రెండ్ అన్నావ్ కదరా నన్ను.. ఫస్ట్ తీసేమని ఎలా చెప్పావ్?” అంటూ కళ్యాణ్ రీతూని ప్రశ్నించాడు. “నేను ఓడిపోయినందుకు కాదు, మోసపోయినందుకు బాధపడుతున్నా” అంటూ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యాడు. రీతూ మాత్రం “ఫ్రెండ్ అంటే అందరి ముందు మోసం చేశానని అనవ్” అంటూ బిగ్గరగా రియాక్ట్ అయింది.
ఇది కూడా చదవండి: Telangana Local Body Elections: తెలంగాణ స్థానిక ఎన్నికలు.. పోటీకి అనర్హులు వీరే!
హౌస్‌లో ట్రయాంగిల్ ట్రాక్ బ్రేక్
ఈ టాస్క్‌తో రీతూ-డీమాన్-కళ్యాణ్ మధ్య ఉన్న ట్రయాంగిల్ ట్రాక్ పూర్తిగా బ్రేక్ అయిపోయినట్లు కనిపించింది. “నమ్మకం పెట్టుకొని బొక్క పెట్టుకున్నావ్” అన్న శ్రీజ మాటలు కూడా ఈ ఎపిసోడ్ హైలైట్‌గా నిలిచాయి.
నాగార్జున రియాక్షన్ కోసం వేచి చూస్తున్న ప్రేక్షకులు
ఇక ఈ వివాదంపై వీకెండ్ బిగ్‌బాస్ ఎపిసోడ్‌లో నాగార్జున ఎలా స్పందిస్తారు అన్నది ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది.
కెప్టెన్సీ టాస్క్‌లో జరిగిన ఈ మలుపులు బిగ్‌బాస్ హౌస్‌లో డైనమిక్స్‌ను పూర్తిగా మార్చేశాయి.