suicide

Suicide: పెళ్లి చేసుకున్న ఆరురోజులకే భర్తతో గొడవ.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య

Suicide: కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామ శివారులోని ఒడ్డెర కాలనీలో విషాదం నెలకొంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది.

స్థానికుల సమాచారం ప్రకారం అదే కాలనీకి చెందిన అల్లెపు గంగోత్రి (22), సంతోష్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుని, పెద్దల అంగీకారంతో సెప్టెంబరు 26న వివాహం చేసుకున్నారు. కొత్తజంటగా ఆనందంగా గడపాల్సిన దశలోనే దురదృష్టకర పరిణామం చోటుచేసుకుంది.

దసరా పండుగ సందర్భంగా అక్టోబరు 2న గంగోత్రి తన భర్తతో కలిసి పుట్టింటికి వచ్చింది. ఆ రాత్రి భోజనం చేస్తుండగా భార్యాభర్తల మధ్య మాటా మాటా పెరిగి గొడవకు దారితీసింది. అనంతరం సంతోష్ తన భార్యతో కలిసి తన ఇంటికి వెళ్లిపోయాడు. అయితే అదే రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత గంగోత్రి ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది.

ఇది కూడా చదవండి: Dussehra: 101 వంటకాలతో కొత్త అల్లుడికి విందు

ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గంగోత్రి తల్లి శారద పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, “నా కూతురు భర్తతో జరిగిన గొడవ వల్లా, లేక అత్తింట్లో ఏదైనా ఒత్తిడి కారణంగానా ఇలా జరిగిందో తెలియదు. కానీ ఆ బలవన్మరణం వెనుక కారణం తెలుసుకోవాలి” అని వేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై ఎస్సై అనిల్ మాట్లాడుతూ, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. కొత్తగా పెళ్లైన యువతి ఇలా ప్రాణాలు తీసుకోవడం గ్రామాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *