NSG Commando: ఒకప్పుడు దేశ రక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన మాజీ NSG కమాండో బజరంగ్ సింగ్ ఇప్పుడు డ్రగ్ మాఫియాగా మారాడు. ముంబై ఉగ్రదాడుల సమయంలో తుపాకీతో ఉగ్రవాదులను ఎదుర్కొన్న ఈ హీరో.. తాజాగా 200 కిలోల గంజాయి స్మగ్లింగ్ కేసులో రాజస్థాన్ పోలీసులకు పట్టుబడ్డాడు.
ఆపరేషన్ “గాంజానే”లో అరెస్టు
రాజస్థాన్ యాంటీ-టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS), యాంటీ-నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ (ANTF) సంయుక్తంగా రెండు నెలల పాటు “ఆపరేషన్ గాంజానే” పేరుతో నిఘా వేసి చివరికి బుధవారం రాత్రి చురు ప్రాంతంలో బజరంగ్ సింగ్‌ను పట్టుకున్నారు. అతనిపై ఇప్పటికే ₹25,000 రివార్డు ప్రకటించబడి ఉంది.
సైనికుడి నుంచి స్మగ్లర్‌గా మారిన బజరంగ్
👉 బజరంగ్ సింగ్ కేవలం 10వ తరగతి వరకు చదివాడు. కానీ 6 అడుగుల ఎత్తు, అద్భుతమైన ఫిట్‌నెస్ కారణంగా మొదట BSF (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్) లో చేరాడు.
👉 పంజాబ్, అస్సాం, రాజస్థాన్, ఒడిశా, బెంగాల్ సరిహద్దుల్లో పనిచేశాడు. చొరబాటుదారులు, మావోయిస్టులపై పోరాడి తన విధేయతతో పై అధికారుల దృష్టిని ఆకర్షించాడు.
👉 తర్వాత NSG కమాండోగా ఎంపికై ఏడు సంవత్సరాలు సేవలందించాడు.
👉 2008 ముంబై ఉగ్రదాడుల సమయంలో అతను ఉగ్రవాదులను ఎదుర్కొని హీరోగా నిలిచాడు.
రాజకీయాల్లోకి.. ఆ తర్వాత నేరాల్లోకి
2021లో ఉద్యోగ విరమణ చేసిన తర్వాత బజరంగ్ సింగ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. భార్యను గ్రామ ఎన్నికల్లో పోటీ చేయించాడు కానీ ఆమె ఓడిపోవడంతో అతని రాజకీయ ఆశలు నెరవేరలేదు. అప్పుడే క్రిమినల్ లింక్స్ కలుసుకుని గంజాయి వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. తెలంగాణ, ఒడిశా స్మగ్లర్లతో చేతులు కలిపి ఏడాదిలోనే భారీ నెట్‌వర్క్ నిర్మించాడు.
ఇది కూడా చదవండి: Vijay Deverakonda-Rashmika: విజయ్ దేవరకొండ- రష్మిక సీక్రెట్ ఎంగేజ్మెంట్
పాత హీరోకు నల్ల చరిత్ర
2023లో హైదరాబాద్‌లోనే 2 క్వింటాళ్ల గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. అప్పటి నుంచి అతని మీద కేసులు నమోదయ్యాయి. చివరికి చురు ప్రాంతంలో వంటమనిషి ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
IG వికాస్ కుమార్ వ్యాఖ్యలు
“బజరంగ్ సింగ్ ఒకప్పుడు దేశాన్ని ఉగ్రవాదుల నుంచి రక్షించిన కమాండో. కానీ ఇప్పుడు అతను డ్రగ్ ట్రాఫికింగ్ మాస్టర్మైండ్‌గా మారిపోయాడు. అతని వద్ద నుంచి 200 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నాం. రాజస్థాన్, తెలంగాణ, ఒడిశా రాకెట్లకు అతని లింకులు ఉన్నట్లు గుర్తించాం” అని ఐజీ వికాస్ కుమార్ తెలిపారు.