Bumrah: భారత స్టార్ బౌలర్ బుమ్రా వెస్టిండీస్‌తో టెస్ట్ మ్యాచ్‌లో అరుదైన రికార్డులు నెలకొల్పాడు. విండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసి భారత్‌లో వేగంగా 50 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్(51), ఆస్ట్రేలియా(64), భారత్.. మూడు దేశాల్లో 50 వికెట్లు తీసిన ప్లేయర్‌గా బుమ్రా నిలిచారు. ప్రస్తుతం వరల్డ్ క్రికెట్లోని యాక్టివ్ ప్లేయర్లలో ఈ ఘనత సాధించింది అతనొక్కడే కావడం విశేషం. బుమ్రా టెస్టుల్లో మరో అరుదైన రికార్డ్ నెలకొల్పారు. ఇండియా పిచ్‌లపై అతి తక్కువ(1,747) బంతుల్లో 50 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచారు. ఇన్నింగ్స్(24) పరంగానూ ఇదే అత్యుత్తమం కాగా, గతంలో జవగళ్ శ్రీనాథ్ పేరిట ఉన్న ఈ రికార్డును బుమ్రా సరిచేశారు. ఈ స్టార్ పేసర్ ఇప్పటి వరకు భారత్ తరఫున టెస్టుల్లో 219 వికెట్లు పడగొట్టారు.: తన టెస్ట్ కెరీర్లో ప్రత్యర్థి వికెట్లను బౌల్డ్ రూపంలో పడగొట్టడంలో బుమ్రా (65) ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ బ్రెట్ లీ (64) ను అధిగమించాడు. స్వదేశంలో 50 కంటే ఎక్కువ వికెట్లు తీసిన భారత బౌలర్లలో 17.00 సగటుతో బుమ్రా ఉత్తమంగా ఉన్నాడు.
