Nagarjuna: టాలీవుడ్ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తన వ్యక్తిగత హక్కులను రక్షించుకోవడానికి ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. నాగార్జున పిటిషన్‌లో, తన ఫొటోలు, పేరు, స్వరం అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించకూడదని, సోషల్ మీడియా, వెబ్‌సైట్లు, ఇతర పబ్లిక్ ప్లాట్‌ఫారమ్‌లపై దుర్వినియోగం జరుగకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
ఈ పిటిషన్‌పై జస్టిస్ తేజస్ కారియా విచారణ నిర్వహించారు. హైకోర్టు నాగార్జున వ్యక్తిగత హక్కులను కాపాడేందుకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అందులో, ముందస్తు అనుమతి లేకుండా ఆయన ఫొటోలు, పేరు, స్వరం వాణిజ్య ప్రకటనల కోసం ఉపయోగించకూడదని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. హైకోర్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జెనరేటివ్ AI, మెషిన్ లెర్నింగ్, డీప్‌ఫేక్స్, ఫేస్ మార్ఫింగ్ వంటి సాంకేతిక పద్ధతుల ద్వారా నాగార్జున వ్యక్తిత్వాన్ని దుర్వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Also Read: Durandhar: ఇండియాని షేక్ చేసేలా దురంధర్ ఫస్ట్ సాంగ్?
నాగార్జున పిటిషన్‌లో పేర్కొన్న వెబ్‌సైట్ లింక్‌లను 72 గంటల్లో తొలగించాల్సిందిగా ఆదేశిస్తూ, ఈ URLలను బ్లాక్ చేయడానికి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్సకు సూచనలు ఇచ్చారు. తదుపరి విచారణను జనవరి 23కి వాయిదా వేసింది హైకోర్టు. లాయర్లు పేర్కొన్నట్లుగా, ఇటీవల ఐశ్వర్య రాయ్ విషయంలోనూ హైకోర్టు సానుకూల తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, నాగార్జునకు కూడా ఇప్పుడు ఊరట లభించడం ఖాయం.