CM Revanth Reddy: స్థానిక ఎన్నికలపై అధికార పార్టీ వేగంగా అడుగులు వేస్తున్నది. స్థానిక ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది. ఈ మేరకు పార్టీకి కూడా దిశానిర్దేశం చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు ఇస్తున్నారు. తాజాగా ఆయన ఆశావహుల జాబితా కోసం పార్టీ నేతలకు కీలక ఆదేశాలను జారీచేశారు.
CM Revanth Reddy: స్థానిక ఎన్నికల్లో జడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను ఈ నెల 5 నాటికే పీసీసీకి పంపాలని మంత్రులు, డీసీసీ అధ్యక్షులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. అన్ని జిల్లాల్లో ఆ జిల్లాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతో సంప్రదించాలని పేర్కొన్నారు. వివాదాస్పదులు కాకుండా, అందరినీ సమన్వయం చేసుకునే నేతలను ఎంపిక చేయాలని చెప్పారు.
CM Revanth Reddy: అదే విధంగా ప్రతి జడ్పీటీసీ స్థానానికి ముగ్గురు బలమైన అభ్యర్థల చొప్పున గుర్తించాలని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే ఇదే విషయాలపై సీఎం రేవంత్‌రెడ్డి జూమ్ మీటింగ్ ద్వారా ఆయా నేతలతో ముచ్చటించారు. ఈ జూమ్ మీటింగ్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తదితరులు పాల్గొన్నట్టు సమాచారం.