GV Prakash

GV Prakash: విడాకులు తీసుకున్న జీవీ ప్రకాష్, సైంధవి

GV Prakash: ప్రసిద్ధ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ కుమార్ మరియు గాయని సైంధవి వైవాహిక బంధం అధికారికంగా ముగిసింది. పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన చెన్నై ఫ్యామిలీ కోర్టు, మంగళవారం తుది తీర్పు వెలువరించింది.

12 ఏళ్ల తర్వాత విడాకులు

2012లో సుదీర్ఘ స్నేహాన్ని ప్రేమగా మార్చుకుని పెళ్లి చేసుకున్న జీవీ ప్రకాశ్ – సైంధవి, సినీ – సంగీత రంగంలో ఆదర్శ జంటగా గుర్తింపు పొందారు. వివాహానంతరం కూడా ఇద్దరూ అనేక కార్యక్రమాలకు కలిసి హాజరై, అభిమానుల నుంచి ప్రత్యేక గుర్తింపు పొందారు. అయితే, కొంతకాలంగా వీరిద్దరి మధ్య తలెత్తిన మనస్పర్థల కారణంగా విడివిడిగా జీవిస్తున్నారు. చివరికి తమ 12 ఏళ్ల వివాహ బంధాన్ని ముగించుకోవాలని నిర్ణయించారు.

కోర్టు ప్రక్రియ

ఈ ఏడాది మార్చి 24న చెన్నైలోని మొదటి అదనపు ఫ్యామిలీ కోర్టులో వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. కేసును విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి సెల్వ సుందరి, చట్ట ప్రకారం ఆరు నెలల గడువు ఇచ్చారు. ఆ గడువు పూర్తికావడంతో సెప్టెంబర్ 25న కేసు విచారణకు రాగా, జీవీ ప్రకాశ్ – సైంధవి కోర్టుకు స్వయంగా హాజరై తమ నిర్ణయాన్ని పునరుద్ఘాటించారు.

ఇది కూడా చదవండి: Komatireddy Raj Gopal Reddy: ఎమ్మెల్యే కాలె యాద‌య్య‌ను కోమ‌టిరెడ్డి అంత మాట‌న్న‌డా?

విచారణ సందర్భంగా వారి కుమార్తె ఎవరి సంరక్షణలో ఉంటుందనే ప్రశ్నకు, చిన్నారి తల్లి సైంధవి వద్దే పెరగడానికి జీవీ ప్రకాశ్ అంగీకరించారు. దీంతో ఇరువురి సమ్మతిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది.

కుటుంబం, కెరీర్

2013లో వివాహం చేసుకున్న ఈ జంటకు 2020లో కుమార్తె జన్మించింది. ఇకపై ఆమె తల్లి సైంధవి వద్దే పెరగనుంది.
జీవీ ప్రకాశ్ కుమార్ తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకుడిగా, అలాగే నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ సహా పలు భాషల్లో ఆయనకు మంచి పేరు ఉంది. మరోవైపు, సైంధవి తన గాన ప్రతిభతో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *