AP News:

AP News: ఏపీలో త‌ల్లుల‌కు మ‌రో గుడ్‌న్యూస్‌

AP News: ఆంద్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని కూట‌మి ప్ర‌భుత్వం ఆ రాష్ట్రంలో బాలింత‌లైన‌ తల్లుల‌కు శుభ‌వార్త‌ను అందించింది. ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో ప్ర‌స‌వించిన మ‌హిళ‌ల‌కు ఉచితంగా అందిస్తున్న ఎన్టీఆర్ బేబీ కిట్‌లో మ‌రిన్ని వ‌స్తువుల‌ను చేర్చ‌నున్న‌ట్టు వెల్ల‌డించింది. ఇటీవ‌లే ఈ ఎన్టీఆర్ బేబీ కిట్‌ను ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప‌రిశీలించారు. అప్పుడే ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలిపారు.

AP News: ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆ కిట్‌లో అద‌నంగా ఫోల్డ‌బుల్ బెడ్‌, బ్యాగును అందించాల‌ని స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ముఖ్య‌మంత్రి ఆదేశాల‌తో బేబీ కిట్‌లో ఇప్పుడు ఇస్తున్న వ‌స్తువ‌ల‌కు అద‌నంగా ఇచ్చేందుకు రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబం సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేస్తున్న‌ది. దీంతో తల్లులు ఆనందంతో ఉన్నారు.

AP News: ఎన్టీఆర్ బేబీ కిట్ ప‌థ‌కం కింద ప్ర‌తి ఏటా 3.20 ల‌క్ష‌ల మంది త‌ల్లుల‌కు కిట్‌లు అందించాల‌ని ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ది. శిశ‌/ ఆరోగ్య సంర‌క్ష‌ణ కోసం 2016లో ఈ ప‌థ‌కాన్ని టీడీపీ ప్ర‌భుత్వం తీసుకొచ్చింది. అయితే 2019లో అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ ప్ర‌భుత్వం ఇదే ప‌థ‌కాన్ని కొన్నాళ్లు కొన‌సాగించినా, దానిని పూర్తిస్థాయిలో అమ‌లు చేయ‌లేదు.

AP News: మ‌ళ్లీ 2024లో అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ ఆధ్వ‌ర్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఏర్పాటైన కూట‌మి ప్ర‌భుత్వం మ‌ళ్లీ ఈ ఎన్డీఆర్ బేబీ కిట్ ప‌థ‌కాన్ని తిరిగి పునఃప్రారంభించింది. ఈ నేప‌థ్యంలోనే ఆ కిట్‌లో గ‌తంలో అందించే వ‌స్తువుల‌కు అద‌నంగా మ‌రో రెండు వ‌స్తువుల‌ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల‌తో చేర్చి ఇవ్వ‌నున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *