TGPSC UPDATES: ఎంపికైన గ్రూప్-1 అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన టీజీపీఎస్సీ.. త్వరలో మరో గ్రూప్ పరీక్షల తుది ఫలితాలను వెల్లడించేందుకు రంగం సిద్ధం చేసి ఉంచింది. ఈ మేరకు గ్రూప్-2 పోస్టుల భర్తీ కోసం తుది జాబితా విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నది. సాధ్యమైనంత త్వరగా ఆ ఫలితాల వెల్లడికి టీజీపీఎస్సీ అధికార వర్గాలు కసరత్తు చేస్తున్నాయి.
TGPSC UPDATES: టీజీపీఎస్సీ గ్రూప్-2 కింద 783 పోస్టుల భర్తీ కోసం 2022లో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆ పోస్టుల కోసం 5,51,855 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు 2024 డిసెంబర్ నెలలో గ్రూప్-2 పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 2,49,964 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. ఆ తర్వాత వ్యాల్యుయేషన్‌లో భాగంగా 13,316 మంది అభ్యర్థులను అనర్హులగా ప్రకటించింది. ఓఎంఆర్ పత్రాల్లో పొరపాట్లు, జబ్లింగ్ సరిగా చేయకపోవడం తదితర కారణాలు పేర్కొన్నది.
TGPSC UPDATES: ఈ మేరకు 2,36,649 మంది అభ్యర్థులతో కూడిన జనరల్ ర్యాంకింగ్‌తో జాబితాను 2025 మార్చి 11న విడుదల చేసింది. ఆ తర్వాత 1:1 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేసి మూడు దఫాలుగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించింది. అవసరమైన వారికి వైద్య పరీక్షలను కూడా నిర్వహించింది. అభ్యర్థుల విద్యార్హతలు, రిజర్వేషన్లు, మెరిట్, తదితర విషయాలను పరిగణనలోకి తీసుకొని ఒకటి రెండు రోజుల్లో తుది జాబితాను ప్రకటించేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు.