TSPSC Group 1: ఎట్టకేలకు టీజీపీఎస్సీ గ్రూప్-1 తుది ఫలితాలను బుధవారం అర్ధరాత్రి తర్వాత కమిషన్ విడుదల చేసింది. నిన్ననే గ్రూప్-1 నియామకాలను చేపట్టవచ్చనే హైకోర్టు ధర్మాసనం ఆదేశాలతో ఫలితాలను విడుదల చేశారు. ఈ మేరకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు ఒక ప్రకటనలో తెలిపింది.
TSPSC Group 1: గ్రూప్-1 నోటిఫికేషన్ మేరకు మొత్తం 563 పోస్టులకు గాను 562 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. ఒక పోస్టును పెండింగ్‌లో ఉంచారు. పోస్టుల ప్రాధాన్యక్రమం ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపిఐన అభ్యర్థుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో కమిషన్ వెల్లడించింది. న్యాయవివాదం నేపథ్యంలో మిగిలిన ఒక్క పోస్టును విత్‌హెల్డ్‌లో ఉంచినట్టు కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు.
TSPSC Group 1: ఇదిలా ఉండగా, రాష్ట్ర హైకోర్టు సింగిల్‌బెంచ్ గతంలో ఇచ్చిన తీర్పుపై హైకోర్టు ధర్మాసనం బుధవారమే స్టే విధించింది. దీంతో ఫలితాల విడుదలకు మార్గం సుగమమైంది. ఆ మేరకు ఫలితాల విడుదలకు కమిషన్ వర్గాలు ఏర్పాట్లను చేశాయి. అదే రోజు అర్ధరాత్రి దాటాక ఎంపికైనవారి తుది జాబితాను ప్రకటించారు. ఈ తుది జాబితాలో మల్టిజోన్-1లో 258 మంది, మల్టిజోన్-2లో 304 మంది గ్రూప్-1 పోస్టులకు ఎంపికైనట్టు టీజీపీఎస్సీ ప్రకటించింది.