Viral news

Viral News: విద్యాధికారిని బెల్ట్‌తో కొట్టిన హెడ్ మాస్టర్

Viral News: ఉత్తరప్రదేశ్‌లో ఓ హెడ్‌మాస్టర్ అతి దారుణంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపుతోంది. మహ్మదాబాద్‌ నద్వా ప్రాథమిక పాఠశాలలో హెడ్‌మాస్టర్‌గా పనిచేస్తున్న బ్రిజేంద్ర కుమార్ తనపై విచారణ జరిపేందుకు వచ్చిన విద్యాధికారిపై బెల్ట్‌తో దాడి చేశాడు. ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళితే – అదే పాఠశాలలో పనిచేస్తున్న ఒక మహిళా ఉపాధ్యాయురాలు, “హెడ్‌మాస్టర్ తనను పదేపదే వేధిస్తున్నాడు” అంటూ అధికారులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదును పరిశీలించేందుకు విద్యాశాఖ అధికారులు పాఠశాలకు చేరుకుని, బ్రిజేంద్ర కుమార్‌ను ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన హెడ్‌మాస్టర్ ఒక్కసారిగా రెచ్చిపడి, విచారణకు వచ్చిన అధికారిని బెల్ట్‌తో కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఈ ఘటనతో విద్యా శాఖ వెంటనే స్పందించి హెడ్‌మాస్టర్‌ను సస్పెండ్‌ చేసింది. అదేవిధంగా అతనిపై కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సంఘటన విద్యా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *