Bigg Boss 9

Bigg Boss 9: కొంప ముంచిన రీతూ.. తనూజ క్రష్ పేరు చెప్పేసింది..!

Bigg Boss 9: ఇప్పటికే బిగ్‌బాస్ సీజన్ 9 మూడో వారం లోకి అడుగుపెటింది. హౌస్‌లో ఎంటర్టైన్మెంట్ తో పాటు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈసారి నామినేషన్లలో హరీష్, ప్రియా, కళ్యాణ్, రాము, ఫ్లోరా, రీతూ ఉన్నారు. వీరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కాబోతుండటంతో అందరి చూపు ఓటింగ్‌పై ఉంది.

గత రెండు వారాలు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ లైన్‌పై డ్రామా నడిపిన బిగ్‌బాస్, ఇప్పుడు హౌస్‌లోని సభ్యుల సీక్రెట్స్ బయటకు తీయడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా రీతూను కన్ఫెషన్ రూంకు పిలిచి ఆమె బలహీనతలను టచ్ చేశాడు. టేబుల్‌పై కప్పిన క్లాత్ తీస్తే చికెన్ ఉండటంతో రీతూ కంటతడి పెట్టుకుంది. ఆపై బిగ్‌బాస్ “ఈ చికెన్ కావాలంటే రహస్యాలు బయటపెట్టాలి” అని చెప్పడంతో, రీతూ తనూజ, కళ్యాణ్, పవన్ గురించి ఒక్కొక్కరిపై చిన్న చిన్న సీక్రెట్స్ చెప్పింది.

తనూజ ఒకరిపై క్రష్ ఉందని, కళ్యాణ్ పట్ల సాఫ్ట్ కార్నర్ చూపిస్తుందని రీతూ బయట పెట్టింది. ఇక పవన్ గురించి మాట్లాడుతూ, అతనికి ఒకసారి లవ్ స్టోరీ ఉన్నా అది పూర్తికాలేదని, ఇప్పటివరకు ప్రాపర్‌గా ఎవరినీ ప్రేమించలేదని చెప్పింది. అయితే ఇవి పెద్దగా సీక్రెట్స్ కాదని బిగ్‌బాస్ కామెంట్ చేయడంతో, మరికొంత టైమ్ కావాలని రీతూ కోరింది.

ఇది కూడా చదవండి: OG: శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్‌తో కలిసి ఉత్తరాంధ్రలో OGని విడుదల చేస్తున్న రాజేష్ కల్లెపల్లి

ఇక గార్డెన్ ఏరియాలో బిగ్‌బాస్ మరో ఎమోషనల్ టాస్క్‌ను హౌస్‌మేట్స్‌కు ఇచ్చాడు. ఆపిల్ చెట్టు ముందు “మీరు చేసిన కష్టం ఫలితంగా కొన్నింటి రుచి తీపిగా ఉంటుంది, మరికొన్నింటి రుచి ఊహించని విధంగా ఉంటుంది. ఎవరికీ ఏ ఫలం దక్కాలో నేను నిర్ణయించుకున్నాను” అంటూ టాస్క్ ప్రారంభించాడు. ఇందులో భాగంగా ఇమ్మాన్యుయేల్ బజర్ నొక్కి కన్ఫెషన్ రూంకి వెళ్లాడు. అతనికి మూడు ఆప్షన్స్ ఇచ్చారు — నాన్న లెటర్ (45% బ్యాటరీ ఖర్చు), అమ్మ ఆడియో మెసేజ్ (35% బ్యాటరీ ఖర్చు), ఫ్యామిలీ ఫోటో (25% బ్యాటరీ ఖర్చు). ఇమ్మాన్యుయేల్ తన భావోద్వేగాలను అదుపులో పెట్టుకోలేక చివరికి ఫ్యామిలీ ఫోటోను ఎంచుకున్నాడు.

ఇలా సీక్రెట్స్, ఎమోషన్స్, టాస్క్‌ల మేళవింపుతో ఈ ఎపిసోడ్ ముగిసింది. వచ్చే రోజుల్లో ఎవరి రహస్యాలు బయటపడతాయో? ఎవరి భావోద్వేగాలు టెలివిజన్ ముందు హైలైట్ అవుతాయో అన్న ఆసక్తి పెరుగుతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *