Crime News:కేరళ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకున్నది. ఓ వ్యక్తి తన భార్యను అమానుషంగా కత్తితో నరికి చంపాడు. ఆ తర్వాత తాను పనిచేసే చోట ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో లైవ్ పెట్టాడు. ఆ తర్వాత తానే తన భార్యను నరికి చంపానని చెప్పి, పోలీసులకు లొంగిపోయాడు. భార్యాభర్తల సంబంధాలు విచ్ఛిన్నమవుతున్నాయనడానికి ఇలాంటి ఘర్షణలు దేశవ్యాప్తంగా తరచూ జరుగుతుండటంతో ఆందోళనకరమని మానసిక విశ్లేషకులు భావిస్తున్నారు.
Crime News:కేరళ రాష్ట్రంలోని కొల్లాం జిల్లా వలక్కోడు కూతనడిలో తన భార్య షైలిన్ (39)తో కలిసి ఇసాక్ నివాసం ఉంటున్నాడు. ఇసాక్ అక్కడే సమీంపలోని రబ్బర్ తోటలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇటీవల వారిద్దరి మధ్య విభేదాలు పొడచూపాయి. దీంతో తరచూ గొడవ పడుతుండే వారు. ఈ నేపథ్యంలో భార్య షైలిన్ ని ఇసాక్ వదిలించుకోవలనుకున్నాడో ఏమో కానీ, ఓ ప్లాన్‌తోనైతే ఉన్నాడు.
Crime News:నిన్న ఉదయం 6.30 గంటలకు షైలిన్ తన ఇంటిలోనే స్నానం చేయడానికి వంటగది సమీపంలో ఉన్న పైపులైన్ వద్దకు వెళ్లింది. ఇదే సమయంలో ప్లాన్‌తో ఉన్న ఇసాక్ వెనుక నుంచి వచ్చి కత్తితో విచక్షణారహితంగా ఆమెపై దాడి చేశాడు. ఈ దాడిలో షైలిన్ మెడ, ఛాతీ, వీపుపై తీవ్రగాయాలయ్యాయి. ఆమె విలవిల్లాడుతూ అక్కడికక్కడే ప్రాణాలిడిచింది.
Crime News:ఆ తర్వాత తాను పనిచేసే రబ్బరు తోటలోకి వెళ్లి లైవ్ వీడియో ద్వారా ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. ఆ తర్వాత తానే తన భార్య షైలిన్ ను హత్య చేసినట్టు ఒప్పుకొని పునలూరు పోలీస్ స్టేషన్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఆ తర్వాత ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీప దవాఖానకు తరలించారు. ఇద్దరి ఫోన్లను స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.