KA Paul: తెలంగాణలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై కేసు నమోదైంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఆయనపై ఓ యువతి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. పోలీసులు యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది.
లైంగిక వేధింపుల ఆరోపణలు, ఫిర్యాదు
కేఏ పాల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక యువతి తాను లైంగిక వేధింపులకు గురయ్యానని షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. తన ఆరోపణలకు మద్దతుగా కొన్ని ఆధారాలను కూడా పోలీసులకు సమర్పించినట్లు ఆమె తెలిపారు. యువతి ఫిర్యాదును స్వీకరించిన షీ టీమ్స్, ఈ కేసును పంజాగుట్ట పోలీసులకు బదిలీ చేసింది. దీనితో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు మొదలుపెట్టారు.
Also Read: Vijayawada Usthav: చిన్ని సంకల్పం.. దేశం గర్వపడేలా ‘విజయవాడ ఉత్సవ్’
కేఏ పాల్‌కు షాక్
రాజకీయాల్లో తనదైన శైలిలో విమర్శలు చేస్తూ వార్తల్లో ఉండే కేఏ పాల్‌పై ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు ఈ ఆరోపణలపై కేఏ పాల్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పోలీసులు ఈ కేసులో మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉంది. ఈ ఘటన ప్రజాశాంతి పార్టీ వర్గాల్లో కూడా కలవరం సృష్టించింది.