Crime News: హైదరాబాద్ మహా నగరంలో వారం రోజుల క్రితం గోనె సంచిలో ఓ మహిళ మృతదేహం బయటపడింది. నిత్యం రద్దీగా ఉండే చర్లపల్లి రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ గోడ వద్ద ఆ సంచిని తీసుకొచ్చిన గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు పక్కన గుట్టుచప్పుడు కాకుండా పడేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత దాని నుంచి తీవ్ర దుర్వాసన వెదజల్లడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఆ గోనె సంచిలో మహిళ మృతదేహం బయటపడింది. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Crime News: పోలీసుల తాజా విచారణలో గోనె సంచిలో చనిపోయి ఉన్న మహిళ ఎవరో తేలింది. ఆ మహిళ పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రమీలగా గుర్తించారు. ఆమె తన భర్తతో విభేదాల కారణంగా పదేళ్ల నుంచి దూరంగా ఉంటున్నది. గత కొన్నాళ్లుగా ఆమె హైదరాబాద్ కొండాపూర్‌లో ఉంటున్న మరొక యువకుడితో సహజీవనం చేస్తున్నదని పోలీసులు తెలిపారు.
Crime News: వారిద్దరి మధ్య విభేదాలు పొడచూపడంతో సదరు యువకుడు ప్రమీలను చంపి, మృతదేహాన్ని చర్లపల్లికి తెచ్చాడని, రైల్వేస్టేషన్ గోడ పక్కన పెట్టి ఎంచక్కా వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు. తన ప్రమేయం బయటపడదని అనుకున్నాడో, ఆమెను వదిలించుకోవాలని చంపాడో.. కానీ ఈ ఘటన సంచలనంగా మారింది. హైదరాబాద్ నగరంలో మహిళ మృతదేహాన్ని ఇలా పడేయడంపై నగర వ్యాప్తంగా ఆందోళన నెలకొన్నది.