Bigg Boss 9

Bigg Boss 9: రీతూ సపోర్ట్ తో.. సెకండ్ వీక్ కెప్టెన్‌గా డిమాన్ పవన్

Bigg Boss 9: బిగ్‌బాస్‌ 9 (Bigg Boss Telugu 9) ఈసారి “డబుల్ హౌస్” అంటూ కొత్త కాన్సెప్ట్‌తో ఎంట్రీ ఇచ్చాడు. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు అన్న ఆలోచన మొదట బుల్లితెర ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించినా.. షో మొదలైన తర్వాత కామనర్స్ ప్రవర్తనతో కొంతమందికి విసుగొస్తోందనే కామెంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా “ఓనర్స్” హౌస్‌లో ఉన్న కామనర్స్, నిజంగానే యజమానుల్లా ఫీలైపోతూ సెలబ్రిటీలపై పెత్తనం చూపించడం హైలైట్ అవుతోంది.

కెప్టెన్సీ రేస్‌లో ఎవరు? ఎవరు కాదు?

నిన్నటి ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ ఓనర్లలో నలుగురిని కెప్టెన్సీకి అనర్హులుగా తేల్చమని ఆదేశించాడు. అందులో ప్రియ, శ్రీజ, పవన్ కళ్యాణ్, హరీష్ బయటపడ్డారు. ఇక భరణి, మర్యాద మనీష్, డీమాన్ పవన్ అర్హులుగా నిలిచారు. వీరికి తోడు టెనెంట్స్ తరఫున ఇమ్మాన్యుయేల్‌ను కంటెండర్‌గా సిలెక్ట్ చేశారు.

రీతూ సపోర్ట్.. పవన్‌కు అడ్వాంటేజ్!

కెప్టెన్సీ టాస్క్‌కి రీతూ చౌదరిని సంచాలక్‌గా పెట్టిన బిగ్‌బాస్.. ఇదే గేమ్‌లో పెద్ద ట్విస్ట్ అయింది. ఎందుకంటే రీతూ ముందుగానే డీమాన్ పవన్ కెప్టెన్ కావాలని కోరుకోవడం, గేమ్‌లోనూ అతడికి ఓవర్ సపోర్ట్ ఇవ్వడం హైలైట్ అయ్యింది.

ఇది కూడా చదవండి: Marri Rajasekhar: జగన్‌కు భారీ షాక్.. టీడీపీలో చేరనున్న మర్రి రాజశేఖర్‌

టాస్క్ హైలైట్స్: 

  • మొదటి రౌండ్: మనీష్ భరణిని టార్గెట్ చేసినా.. ఇమ్మూ-భరణి కాంబినేషన్‌తో మనీష్ మొదటగా అవుట్ అయ్యాడు.

  • రెండో రౌండ్: భరణి-ఇమ్మూ కలిసి డీమాన్ పవన్‌ని టార్గెట్ చేశారు. కానీ రీతూ “రూల్స్ బ్రేక్ చేశాడు” అంటూ భరణినే గేమ్ నుంచి తీసేసింది. దీంతో ఓనర్లు రీతూని మెచ్చుకోగా, భరణి సైలెంట్‌గా బయటకు వచ్చాడు.

  • ఫైనల్ రౌండ్: ఇమ్మూ-డీమాన్ మధ్య కఠిన పోటీ జరిగింది. రూల్స్ ప్రకారం టీషర్ట్ లాగకూడదని ఉన్నా.. డీమాన్ రూల్స్ బ్రేక్ చేశాడు. అయినా రీతూ ఇమ్మాన్యుయేల్ పైనే సీరియస్ అయింది. చివరికి గట్టిపోటీ ఇచ్చినా కొద్దీ తేడాతో ఇమ్మూ ఓడిపోయి, డీమాన్ పవన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

ప్రేక్షకుల రియాక్షన్

ఈ ఎపిసోడ్‌తో ప్రేక్షకులు “రీతూ స్పష్టంగా పవన్‌కే ఫేవర్ చేస్తోంది” అని చర్చించుకుంటున్నారు. మరోవైపు కామనర్స్ వైఖరి, చిన్న చిన్న గొడవలు షోలో హైలైట్ అవుతున్నాయి. ఇక పవన్ రెండో కెప్టెన్‌గా హౌస్‌ను ఎలా నడిపిస్తాడో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *