Ameesha Patel

Ameesha Patel: అందుకే ఇంకా పెళ్లి చేసుకోలేదు

Ameesha Patel: అమీషా పటేల్ వివాహం చేసుకోకపోవడంపై ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. అమీషా పటేల్ మాట్లాడుతూ, వివాహం చేసుకోవాలని తనకు ఎప్పుడూ అనిపించలేదని, దీనికి ముఖ్యమైన కారణం తన తల్లిదండ్రులకు వివాహబంధం మీద ఉన్న అసంతృప్తి అని తెలిపారు. తన తల్లిదండ్రులు నిరంతరం పోట్లాడుకోవడం, ఒకరిపై ఒకరు అరిచేసుకోవడం ఆమెను ప్రభావితం చేసిందని వివరించారు. పెళ్లికి సిద్ధంగా లేరని చెప్పిన ఆమె, మరి మీకు సరైన వ్యక్తి దొరకలేదా అని అడగగా, తనకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని, దీనికి వయసుతో సంబంధం లేదని స్పష్టం చేశారు. చాలా మంది పెళ్లికాని యువకులు తనతో డేటింగ్‌కు ఆసక్తి చూపుతున్నారని, తన వయసులో సగం ఉన్నవారు కూడా తనతో బయటకు వెళ్లాలని అడుగుతున్నారని చెప్పారు.

ఇది కూడా చదవండి: Marri Rajasekhar: జగన్‌కు భారీ షాక్.. టీడీపీలో చేరనున్న మర్రి రాజశేఖర్‌

సినిమాల్లో మంచి పాత్రల కోసం చాలా త్యాగాలు చేశానని, పెళ్లి చేసుకుంటే తనపై నిషేధం విధిస్తారేమోనని భయపడి కూడా వివాహానికి దూరంగా ఉన్నానని అమీషా పటేల్ పేర్కొన్నారు. అప్పట్లో నటీమణులు పెళ్లి చేసుకుంటే కెరీర్ ముగిసిపోయేది. ఆనాటి పద్ధతులు తన కెరీర్‌ను బాగా ప్రభావితం చేశాయి అని ఆమె తెలిపారు. ఇప్పుడు నటీమణులు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కెరీర్‌ను కొనసాగించడాన్ని చూసి అభినందిస్తున్నానని, తమ కాలంలో ఈ అవకాశం ఉండేది కాదని అమీషా చెప్పారు. తాను ఇప్పటికీ తన పనిని ప్రేమిస్తున్నానని, అందుకే పెళ్లి గురించి ఆలోచించడం లేదని స్పష్టం చేశారు. అమీషా పటేల్ చివరిసారిగా గదర్ 2 సినిమాలో కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *