TGSRTC: బతుకమ్మ, దసరా పర్వదినాల సందర్భంగా టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఆయా పండుగల సందర్భంగా ప్రయాణికుల సందడి పెరుగుతుంది. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు, బస్సు సర్వీసుల సంఖ్యను పెంచేందుకు సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. రేపటి నుంచి (సెప్టెంబర్ 20) ప్రత్యేక సర్వీసులను నడపాలని ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది.
TGSRTC: పండుగల వేళ రాష్ట్రవ్యాప్తంగా 7,754 ప్రత్యేక సర్వీసులను నడపాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ప్రత్యేక ప్రణాళికలను కూడా సిద్ధం చేసింది. వాటిలో 377 స్పెషల్ బస్సు సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించింది. మిగతా వాటిని ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సు సర్వీసులను నడపనున్నది.
TGSRTC: అంతేకాకుండా పండుగలకు సొంతూళ్లకు వెళ్లిన వారు తిరుగుపయనంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కూడా ప్రత్యేక సర్వీసులను నడపాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు అక్బోలర్ 5, 6 తేదీల్లోనూ రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు ఆర్టీసీ ఉన్నతాధికారులు వెల్లడించారు.