Telangana:

Telangana: మంత్రి వివేక్‌పై మ‌రో మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు

Telangana: రాష్ట్ర అట‌వీశాఖ మంత్రి కొండా సురేఖ‌.. మ‌రో మంత్రి అయిన వివేక్ వెంక‌ట‌స్వామిపై ముఖ్య‌మంత్రి అధికారిక కార్యాల‌యంలో ఏకంగా ఫిర్యాదు చేశారు. త‌న‌కు తెలియ‌కుండా త‌న శాఖ అధికారుల‌తో స‌మావేశ‌మ‌య్యార‌న్న‌ది ఆమె ఆరోప‌ణ‌. దీనిని మంత్రివ‌ర్గంలో స‌మ‌న్వ‌య లోపానికి నిద‌ర్శ‌నంగా విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. ఏది క‌రెక్ట్‌.. ఏది త‌ప్పు అన‌డానికి క‌న్నా ముందు.. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివి స‌హ‌జ‌మేన‌ని విమ‌ర్శ‌కులు ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు.

Telangana: ఉపాధి, గ‌నుల శాఖ మంత్రి వివేక్ వెంక‌ట్‌స్వామి త‌న‌కు క‌నీస స‌మాచారం ఇవ్వ‌కుండా త‌న శాఖ అధికారుల‌తో స‌మావేశం ఏర్పాటు చేశార‌ని రాష్ట్ర అటవీ, ప‌ర్యావ‌ర‌ణ‌, దేవాదాయ, ధ‌ర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సీఎంవోకు ఫిర్యాదు చేశారు. గ‌త 2, 3 రోజుల క్రితమే ఈ స‌మావేశం జ‌రిగింద‌ని పేర్కొంటూ ఆమె తాజాగా ఫిర్యాదు చేశారు.

Telangana: స‌మావేశం జ‌రిగిన విష‌యాన్ని త‌న శాఖ అధికారుల ద్వారా త‌న‌కు తెలిసింద‌ని కొండా సురేఖ తెలిపారు. త‌న‌కు తెలియ‌కుండా త‌న శాఖ అధికారుల‌తో మ‌రో శాఖ మంత్రి స‌మావేశం కావ‌డంపై మంత్రి సురేఖ అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. కొంద‌రు మంత్రుల‌కు తెలియ‌కుండానే ఆయా శాఖ‌ల్లో కొన్ని నిర్ణ‌యాలు పైనుంచి అమ‌లు కావ‌డం త‌ర‌చూ జ‌రుగున్న‌ట్టు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల వ్య‌వ‌సాయ శాఖలో ఓ ఉన్న‌తాధికారి నియామ‌కంపై ఆ శాఖ మంత్రికే తెలియ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *