Bigg Boss 9

Bigg Boss 9: సుమన్ శెట్టి లాగి పడేసిన పవన్.. తర్వాత బిగ్ బాస్ ఏం చేశారు అంటే..?

Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9లో కంటెస్టెంట్స్ మధ్య పోటీ రోజురోజుకూ తీవ్రంగా మారుతోంది. మొదట్లో కాస్త సైలెంట్‌గా ఉన్న సుమన్ శెట్టి, ఇప్పుడు తన అసలు ఆటతీరు చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అయితే తాజాగా జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లో కంటెస్టెంట్స్ ఓనర్స్–టెనెంట్స్‌గా విడిపోయి గేమ్ ఆడాల్సి వచ్చింది. ప్రతి టీంకీ ఒక టైమర్ ఇవ్వగా, టాస్క్ పూర్తి చేస్తే అదనంగా ఒక గంట సమయం పెరుగుతుంది. చివరికి ఎవరి టైం ఎక్కువగా ఉంటే వారు విజేత అవుతారు. ఈ టాస్క్‌లో భాగంగా ఒక పెద్ద చక్రం ఇవ్వగా, దాని చివర హ్యాండిల్‌ను ఒక్క చేత్తో మాత్రమే పట్టుకోవాలి. ఇక్కడే గేమ్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది.

ఇది కూడా చదవండి: Actor Robo Shankar : అనారోగ్యంతో నటుడు రోబో శంకర్ మృతి..

ఈ టాస్క్‌లో ఇమ్మానుయేల్, భరణి అదరగొట్టగా, సుమన్ శెట్టి కూడా చివరి వరకు తన శక్తివంచన లేకుండా పోరాడాడు. అయితే చివర్లో కామనర్ డిమాన్ పవన్, సుమన్‌ను గేమ్ నుండి తప్పించేందుకు అతని మెడ పట్టుకుని బలంగా తోసేయడంతో, సుమన్ పల్టీలు కొడుతూ నేలకుపడిపోయాడు. ఈ సంఘటనతో సుమన్ గాయపడినట్లు సమాచారం. వెంటనే అతడిని మెడికల్ రూమ్‌కు పిలిపించినట్లు తెలుస్తోంది.

డిమాన్ పవన్ కావాలని సుమన్‌ను గాయపరిచే ఉద్దేశంతో కాకుండా, గేమ్‌పై పట్టుదలతో ఇలా చేశాడని అంటున్నా, ప్రేక్షకులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. సుమన్ అభిమానులు పవన్ ప్రవర్తనను తీవ్రంగా విమర్శిస్తూ, “గెలవాలంటే ఇలా మొరటుగా ఆడాలా?” అంటూ నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు.

ప్రస్తుతం ఈ టాస్క్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, బిగ్ బాస్ హౌస్‌లో కొత్త హీట్ క్రియేట్ చేస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *