Vrushabha

Vrushabha: కంప్లీట్ యాక్టర్, సూపర్ స్టార్ మోహ‌న్ లాల్ ప్రెస్టీజియ‌స్ మూవీ ‘వృషభ’ టీజర్ విడుదల

Vrushabha: కంప్లీట్ యాక్టర్, సూపర్ స్టార్ మోహ‌న్ లాల్ న‌టిస్తోన్న భారీ చిత్రం ‘వృషభ’. ఇంకా రాగిణి ద్వివేది, సమర్జిత్ లంకేష్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. కనెక్ట్‌ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సి.కె. పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా ప్రెస్టీజియ‌స్‌గా నిర్మించారు. రచయిత, ద‌ర్శకుడు నంద కిషోర్ తెరకెక్కిస్తున్న ఈ భారీ మూవీలో మోహన్ లాల్‌ను సరికొత్తగా చూపించబోతున్నారు.

‘వృషభ’ టీజర్‌లోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, వీఎఫ్ఎక్స్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ టీజర్‌తో మూవీ మీద ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు. ఈ టీజర్‌లో ఆంటోనీ సామ్సన్ విజువల్స్, కె.ఎం. ప్రకాష్ ఎడిటింగ్, సామ్ సిఎస్ మ్యూజిక్, అకాడమీ అవార్డు గ్రహీత రసుల్ పూకుట్టి సాండ్ డిజైనింగ్ అదిరిపోయింది. ఎస్ఆర్‌కే, జనార్ధన్ మహర్, కార్తీక్ డైలాగ్స్, పీటర్ హెయిన్, స్టంట్ సిల్వా, నిఖిల్ కొరియోగ్రఫీ చేసిన అడ్రినలిన్-పంపింగ్ యాక్షన్ సీక్వెన్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. టీజ‌ర్ విడుద‌లైన సంద‌ర్భంగా..

నిర్మాత ఏక్తా కపూర్ మాట్లాడుతూ .. ‘బాలాజీలో మేము ఎప్పుడూ ప‌వ‌ర్‌ఫుల్ స్టోరీని చెప్పేందుకు ప్రయత్నిస్తుంటాం. ‘వృషభ’ మా అందరికీ ఎంతో నచ్చిన, ఇన్‌స్పైర్‌ చేసిన ప్రాజెక్ట్. ఇది మాకు కేవలం సినిమా కాదు. ఎమోషన్స్, రిలేషన్స్, రివేంజ్, స్వేచ్ఛ కోసం చేసే పోరాటం వంటి అంశాలతో తెరకెక్కించాం. ఈ మూవీతో అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేందుకు మేం ప్రయత్నిస్తున్నామ’ని అన్నారు.

దర్శకుడు నంద కిషోర్ మాట్లాడుతూ .. ‘‘వృషభ’ కేవలం ఓ సినిమా కాదు. మాకు ఇది ఓ మర్చిపోలేని ఎమోషన్. లెజెండరీ మోహన్ లాల్ తో కలిసి పనిచేయడం ఓ గౌరవంగా భావిస్తున్నాను. ఆయన ఉండే ప్రతి ఫ్రేమ్ ఎంతో రిచ్‌గా కనిపిస్తుంటుంది. కొడుకు పాత్రలో సమర్జిత్ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా ‘వృషభ’ అనేది తండ్రీకొడుకుల చుట్టూ తిరిగే శక్తివంతమైన కథ. ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామ’ని అన్నారు.

మలయాళం, తెలుగు భాషలలో ఒకేసారి చిత్రీకరించబడిన ఈ చిత్రం హిందీ, కన్నడ భాషలలో కూడా విడుదల అవుతుంది.ఈ ఏడాది దీపావళి సందర్భంగా ఆడియెన్స్ ముందుకు రానుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *