Deepika Padukone

Deepika Padukone: కల్కి 2898 ఏడి’ సీక్వెల్‌ నుండి తప్పుకున్న దీపికా పదుకొనే

Deepika Padukone: పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన “కల్కి 2898 AD” సీక్వెల్‌కు సంబంధించిన కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే, ఈ సినిమా సీక్వెల్‌లో నటించడం లేదు అన్ని నిర్మాతలు ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించారు.

కల్కి 2898 AD విజయవంతమైన తొలి భాగం

2024లో విడుదలైన ఈ భారీ ప్రాజెక్ట్‌ను దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించగా, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే, దిశా పటానీ కీలక పాత్రల్లో నటించారు. హిందూ పురాణ గాథలకు ప్రేరణగా రూపొందిన ఈ కథ, సైన్స్ ఫిక్షన్ ఇంకా హిందూ పురాలని కలిపి సాగె కథగా చూపొచ్చు. విష్ణువు చివరి 10వ అవతారం కల్కి పుట్టబోయే శిశువును రక్షించేందుకు ఒక బృందం చేసే పోరాటమే ఈ కథ. 

దీపికా కెరీర్‌లో తాజా ప్రాజెక్ట్

దీపికా పదుకొనే చివరిసారిగా రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన “సింగం అగైన్” (2024) లో కనిపించారు. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో కరీనా కపూర్, రణవీర్ సింగ్, అక్షయ్ కుమార్, టైగర్ శ్రాఫ్, అర్జున్ కపూర్ తదితరులు నటించారు.

కల్కి సినిమాటిక్ యూనివర్స్‌కి కొత్త ఆరంభం

కల్కి 2898 AD మొదటి భాగం కథ మొత్తం దీపికా క్యారెక్టర్ చుటూ తిరుగుతుంది. రెండో భాగంలో ఆమె క్యారెక్టర్ ని వేరే వాళ్లతో రీప్లేస్ చేయడానికి కుదరదు. ఈ నిర్ణయంతో సినిమా ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి. దీపికా ఇలాచేయడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు సందీప్ రెడ్డి వంగా సినిమాకి కూడా నో చెప్పారు తర్వాత ఆ సినిమా పై ఓ ఇంటర్వ్యూ లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *