Pennsylvania Police Shooting

Pennsylvania Police Shooting: పెన్సిల్వేనియాలో కాల్పుల కలకలం.. ముగ్గురు పోలీసులు మృతి, ఇద్దరికి గాయాలు

Pennsylvania Police Shooting: అమెరికాలోని పెన్సిల్వేనియాలో కాల్పులు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. నార్త్ కొడోరస్ టౌన్‌షిప్‌లో బుధవారం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు పోలీసు అధికారులు మరణించారు. మరో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.

ఒక కుటుంబ సమస్యకు సంబంధించి విచారణ కోసం పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లగా, ఓ దుండగుడు వారిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు పోలీసులు గాయపడగా, వారిలో ముగ్గురు మరణించారు. గాయపడిన ఇద్దరు పోలీసులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Horoscope Today: ఈ రాశి వారికి డబ్బులే డబ్బులు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

అనంతరం పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగుడు కూడా మరణించాడు. అయితే, నిందితుడి వివరాలు, కాల్పులకు గల కారణాలపై పోలీసులు ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.

ఈ ఘటనపై పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షపిరో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాజంలో ఇలాంటి హింసకు తావు లేదని, మెరుగైన సమాజం కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. మృతి చెందిన అధికారుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *