Telangana: తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇంటిలో చోరీ జరిగి రెండు నెలలు తిరగక ముందే మరో మంత్రి ఇంటిలో చోరీ చోటుచేసుకున్నది. ఈ రెండు ఘటనలు హైదరాబాద్ నగరంలోని మంత్రుల నివాసాల్లోనే చోటుచేసుకోవడం గమనార్హం. ఆ నాడు డిప్యూటీ సీఎం ఇంటిలో నగదు, బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి. పోలీసులు దర్యాప్తు చేపట్టి పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ఖరగ్‌పూర్‌లో నిందితులను పట్టకొని, నగదు, ఆభరణాలను రికవరీ చేశారు.
Telangana: తాజాగా మరో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి అయిన దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఇంటిలో జరిగిన చోరీ వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి శ్రీధర్‌బాబు నివాసం ఉంటున్నారు. ఈ నెల 31న దీపావళి పండుగ రోజున ఆయన సెల్‌ఫోన్ చోరీకి గురైంది. తన సెల్‌ఫోన్ వెతికి పెట్టాల్సిందిగా కోరుతూ పోలీసులక ఫిర్యాదు చేశారు. దీంతో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో దొంగతనాలు నిత్యకృత్యమయ్యాయనడానికి ఇలాంటి ఘటనలే నిదర్శనమని పేర్కొంటున్నారు.

