Kerala:

Kerala: మెద‌డును తినే అమీబా.. కేర‌ళ‌లో ఈ ఏడాదే 18 మంది మృతి

Kerala: కాల‌క్ర‌మంలో అరుదైన వ్యాధుల‌తో జ‌నం అతలాకుత‌లం అవుతున్నారు. క‌రోనాకు ముందు, త‌ర్వాత ప‌లు ర‌కాల వింతైన వ్యాధులు మ‌నుషుల‌ను చంపేస్తున్నాయి. వివిధ రూపాల్లో అవి మ‌నిషి ప్రాణాల‌ను హ‌రిస్తున్నాయి. క‌రోనా అంత తీవ్ర‌త లేకున్నా, మున్ముందు ఇలాంటి వ్యాధులు విస్త‌రిస్తే మాన‌వాళికి ప్ర‌మాద‌మేన‌ని హెచ్చ‌రిస్తున్నారు. తాజాగా మ‌న‌దేశంలో ఇటీవ‌ల మెద‌డును తినే అమీబాను గుర్తించారు. ఈ అమీబా సోకిన వారిలో 18 మంది ఒక్క కేర‌ళ‌ల‌లోనే మృత్యువాత‌ప‌డ్డారు.

Kerala: మెద‌డును తినే అమీబా సోకి ఈ ఏడాది దేశంలో 67 కేసులు న‌మోద‌య్యాయి. అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటీస్ అనే అరుదైన బ్రెయిన్ ఇన్‌ఫెక్ష‌న్ కేర‌ళ రాష్ట్రంలో క‌ళ‌క‌ళం రేపుతున్న‌ది. మెద‌డును తినే అమీబా పిలిచే ఈ వ్యాధి కార‌ణంగా ఆ రాష్ట్రంలో మ‌ర‌ణాల సంఖ్య పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. తిరువ‌నంత‌పురంలోని 17 ఏళ్ల యువ‌కుడికి ఈ వ్యాధి సోకిన‌ట్టు గుర్తించి నిర్ధారించారు. అనుమానంతో అక్క‌డి ఓ స్విమ్మింగ్ ఫూల్‌ను మూసివేయించారు.

Kerala: ఆ 17 ఏళ్ల కుర్రాడు త‌న స్నేహితుల‌తో క‌లిసి అక్కూలం టూరిస్ట్ విలేజ్‌లోని స్విమ్మింగ్ ఫూల్‌లో స్నానం చేశాడు. ఆ మ‌రుస‌టి రోజే అత‌డికి వ్యాధి ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో అధికారులు జాగ్ర‌త్త ప‌డ్డారు. వెంట‌నే ఆ స్విమ్మింగ్ పూల్‌ను మూసి వేయించారు. ఆ స్విమ్మింగ్ పూల్‌లోని నీటి న‌మూనాల‌ను ప‌రీక్ష‌ల కోసం పంపారు. 18 వ‌రుస మ‌ర‌ణాల‌తో ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్ర‌మ‌త్త‌మైంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *