CM Chandrababu: అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్ లక్ష్యాలపై సీఎం చంద్రబాబు మాట్లాడారు.
సంక్షేమంపై దృష్టి
ప్రతి నెల ఒకటో తరికి రాగానే 33 వేల కోట్ల రూపాయల పెన్షన్‌ను అందచేస్తునం అన్నారు. ఇక “ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే, అంతమందికీ తల్లికి వందనం పథకం ఇస్తున్నం. దింతో స్కూల్ కి వేలే వారి సంఖ్య పెరుగుతుంది అని పేర్కొన్నారు. మహిళా శక్తి సాధ్యం కాదు అన్నారు కానీ కూటమి ప్రభుత్వం చేసి చూపిందని గర్వంగా చెప్పారు.
భారత ఆర్థిక దిశ – ఆంధ్రప్రదేశ్ విజన్
భారత ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉండేది ఇప్పుడు 4వ స్థానానికి ఎదిగిందని గుర్తు చేసిన ఆయన, “మరో 22 ఏళ్లలో స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తికానుంది. ఆ టైం నాటికీ భారత్ అగ్రస్థానంలో ఉంటుంది” అని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం 2047 వికసిత్ భారత్ ప్రణాళిక రూపొందిస్తే, ఏపీ స్వర్ణాంధ్ర విజన్ 2047 సిద్ధం చేసిందని తెలిపారు. ఇది అన్ని అధికారులకూ మార్గదర్శక గ్రంథం కావాలని సూచించారు.
అభివృద్ధి–సంక్షేమం సమాంతరంగా
ప్రస్తుతం రాష్ట్ర వృద్ధి రేటు 10.5% వద్ద ఉంది. 2047 నాటికి 15% వృద్ధి రేటు సాధించాలన్నదే లక్ష్యం అని చెప్పారు. ఈ ఏడాది తలసరి ఆదాయాన్ని ₹3.47 లక్షలకు పెంచడం, 2029 నాటికి రాష్ట్ర జీఎస్డీపీని ₹29 లక్షల కోట్లకు తీసుకెళ్లడం లక్ష్యమని వెల్లడించారు. అదే సమయంలో ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు సంక్షేమాన్ని సమాంతరంగా అమలు చేస్తామన్నారు.
కలెక్టర్ల పాత్రపై ప్రత్యేకంగా
ప్రధాని, సీఎం తర్వాత అత్యంత కీలక వ్యక్తులు కలెక్టర్లే. జిల్లాల రూపురేఖలను మార్చేది వారే. ప్రభుత్వ విధానాలను సక్రమంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లపై ఉంది అని సీఎం స్పష్టం చేశారు. కొత్తగా నియమితులైన కలెక్టర్లకు శుభాకాంక్షలు తెలుపుతూ, కొనసాగుతున్న కలెక్టర్లు తమ ప్రతిభ నిరూపించుకోవాలని సూచించారు.
ఇది కూడా చదవండి: Supreme Court: వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు
జల వనరుల ప్రాధాన్యత
నీరు లభిస్తే జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుందని అనంతపురం ఉదాహరణగా పేర్కొన్నారు. “పట్టిసీమ ద్వారా కృష్ణా జలాలను రాయలసీమకు మళ్లించాం. హంద్రీనీవా ప్రాజెక్ట్‌ను 100 రోజుల్లో పూర్తి చేసి నీటిని కుప్పం వరకు తీసుకెళ్లాం. ఒకప్పుడు నీరు ఎప్పుడూ లేని పెన్నా నదికి ఇప్పుడు వరదలు వస్తున్నాయి” అని సీఎం వివరించారు.
సామాజిక న్యాయం – డబుల్ ఇంజన్ సర్కార్
కేబినెట్‌లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి మంత్రులను నియమించామని, డబుల్ ఇంజన్ సర్కార్ – డబుల్ ఇంజన్ గ్రోత్ లక్ష్యంతో పనిచేస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.