Eesaraina Movie Review

Eesaraina Movie Review: గవర్నమెంట్ జాబ్ కోసం యువకుని తపన . . “ఈసారైనా?!” ఫలించిందా?

Eesaraina Movie Review: ఈసారైనా?! సినిమా విప్లవ్ కి హీరో, డైరెక్టర్, నిర్మాత, మాటల రచయిత గా మంచి పేరు తెచ్చి పెట్టే సినిమా. అన్ని తానే అయి ఈ సినిమాని పూర్తిచేశాడు. పల్లెటూరులోని అద్భుతమైన లొకేషన్స్లో ఈ సినిమాని తీశారు. విప్లవ్ అశ్విని ల మధ్య లవ్ ట్రాక్, రొమాంటిక్ సీన్స్ యూత్ కి కనెక్ట్ అవుతుంది. క్లైమాక్స్ లో వచ్చే ఏ గాయమొ సాంగ్ ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. చిన్నపిల్లల బ్యాక్ డ్రాప్ లో వచ్చే తారా తీరమే సాంగ్ మంచి లవ్ సాంగ్. అశోక్ మూలవిరాట్ పాత్ర వచ్చే ట్విస్ట్ బాగుంటుంది.

కథ ఇలా.. 

Eesaraina Movie Review: డిగ్రీ పూర్తి చేసుకుని నాలుగేళ్లు అవుతున్న ఉద్యోగం లేకుండా గవర్నమెంట్ నోటిఫికేషన్ కోసం చూస్తూ గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి అనుకుంటాడు రాజు (విప్లవ్). అప్పటికే అదే ఊర్లో హీరోయిన్ శిరీష (అశ్విని) గవర్నమెంట్ టీచర్ గా జాబ్ చేస్తూ ఉంటుంది. మూడుసార్లు నోటిఫికేషన్ వచ్చి ఫెయిలవుతాడు రాజు. తను ఎలాగైనా జాబు సాధిస్తాడని తన స్నేహితుడు మహబూబ్ బాషా, అశ్విని హీరోని ఎంకరేజ్ చేస్తుంటారు. అశ్విని తండ్రి నీకు గవర్నమెంట్ జాబ్ వస్తే నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను అని అంటాడు. హీరో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాడా లేదా? చివరికి హీరోయిన్ తండ్రి ఎలా మారాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ‘ఈసారైనా!?’ సినిమా చూడాల్సిందే.

ఎవరు ఎలా చేశారంటే?
Eesaraina Movie Review: హీరో విప్లవ్ ఫస్ట్ మూవీ అయిన పల్లెటూరి పల్లెటూరిలో గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న కుర్రాడిలా అద్భుతంగా నటించాడు. అశ్విని స్క్రీన్ ప్రసన్స్ యాక్టింగ్ చాలా బాగున్నాయి. తండ్రి పాత్రలో ప్రదీప్ రాపర్తి  నటన బాగుంది. ఒకపక్క నవ్విస్తూనే సీరియస్ తండ్రి పాత్రలో చాలా బాగా నటించారు. సపోర్టింగ్ క్యారెక్టర్ లో స్నేహితుడిగా మహబూబ్ బాషా నటన నవ్విస్తూ అలరిస్తుంది. సత్తన్న, అశోక్ మూలవిరాట్ ఎవరు పరిధి మేరకు వారి పాత్రల్లో నటించారు. హీరో చిన్నప్పుడు క్యారెక్టర్ లో సలార్ కార్తికేయ దేవ్, హీరోయిన్ చిన్నప్పటి క్యారెక్టర్ లో నీతు సుప్రజ నటన బాగుంది.

టెక్నికల్ గా ఇలా . . 
Eesaraina Movie Review: విప్లవ్ హీరో గానే కాకుండా దర్శకుడిగా నిర్మాతగా ఎడిటర్ గా అన్ని తానే అయి ఎక్కడ కాంప్రమైస్ కాకుండా తన సొంత ఊరిలో అద్భుతంగా నిర్మించారు. సహ నిర్మాతగా సంకీర్త కొండ విప్లవకి సపోర్టుగా నిలబడి ఈ సినిమాని నిర్మించారు. గిరి సినిమాటోగ్రఫీ తేజ్ మ్యూజిక్ సినిమాకి హైలైట్. అదేవిధంగా గోరేటి వెంకన్న, రాకేందు మౌళి, శరత్ చేపూరి అందించిన పాటలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ : మ్యూజిక్, సాంగ్స్, కథ,
ఆర్టిస్టుల నటన, సినిమాటోగ్రఫీ, డైలాగ్స్ బాగా పండాయి, తక్కువ నిడివి కూడా ప్లస్ పాయింట్

మైనస్ పాయింట్స్ : ఫస్టాఫ్, కొన్ని లాగ్ సీన్స్, తెలిసిన ఆర్టిస్టులు లేకపోవడం

రేటింగ్ : 3/5

ఇది కూడా చదవండి :  వాస్తవ ఘటనల ఆధారంగా వచ్చిన జితేందర్ రెడ్డి మూవీ ఎలా ఉందంటే . .

నటీనటులు : విప్లవ్, అశ్విని, ప్రదీప్ రాపర్తి, మహబూబ్ బాషా, కార్తికేయ దేవ్, నీతు క్వీన్, సత్తన్న, అశోక్ మూలవిరాట్

టెక్నీషియన్స్:
నిర్మాత: విప్లవ్
సహ నిర్మాత: సంకీర్త్ కొండా
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: విప్లవ్
సంగీతం: తేజ్
డి ఓ పి: గిరి
ఎడిటింగ్: విప్లవ్
కళ: దండు సందీప్ కుమార్
డి ఐ: మేయిన్ స్టూడియోస్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అభినయ్ కొండ
లైన్ ప్రొడ్యూసర్: పూర్ణిమ రెడ్డి
సాహిత్యం: గోరేటి వెంకన్న, రాకేందు మౌళి, శరత్ చేపూరి
గాయకులు: గోరేటి వెంకన్న, ఎల్ వి రేవంత్, పి వి ఎన్ ఎస్ రోహిత్, యశ్వంత్ నాగ్
పబ్లిసిటీ మరియు లిరికల్: బాబీ
పి ఆర్ ఓ : మధు VR

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *