Google Gemini 3D Printing

Google Gemini 3D Printing: జెమినీ 3డీతో జాగ్రత్త.. అశ్లీల ఫోటోలతో రావచ్చట…

Google Gemini 3D Printing: ఫోటో ఆధారంగా మానవుడి ప్రతిరూపాన్ని సరిగ్గా తయారు చేసే కొత్త టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. జెమిని 3డీ ప్రింట్ సాయంతో వ్యక్తుల ఫోటోను స్కాన్ చేసి డిజిటల్ మోడల్‌గా మార్చి, ఆ తర్వాత 3డీ ప్రింటర్‌తో నిజమైన బొమ్మలుగా తయారు చేస్తున్నారు.

ఈ విధానం ద్వారా పుట్టినరోజులు, శుభకార్యాలు, బహుమతుల వంటి ప్రత్యేక సందర్భాలకు వినూత్నంగా బొమ్మలు తయారవుతున్నాయి. ఇప్పటికే 115కు పైగా విగ్రహాలను రూపొందించారు.

15 సెంటీమీటర్ల నుంచి 50 సెంటీమీటర్ల వరకు వివిధ పరిమాణాల్లో ఈ బొమ్మలు లభిస్తున్నాయి. ఒక్కో విగ్రహం ధర సుమారు 15 వేల రూపాయల వరకు ఉంటుంది. జపాన్, అమెరికా వంటి దేశాల్లో ఇప్పటికే మంచి ఆదరణ పొందిన ఈ ట్రెండ్ ఇప్పుడు మన దేశంలోనూ ప్రాచుర్యం పొందుతోంది.

ఇది కూడా చదవండి: Bullet Train: 2 గంటల్లో 629 కి. మీ.. రైల్వే శాఖ సరికొత్త ప్లాన్

ఒక వ్యక్తి యొక్క పూర్తి మోడల్ తయారు చేయడానికి కనీసం రెండు ఫోటోలు అవసరం అవుతాయి – ముందువైపు, పక్కవైపు. వాటి ఆధారంగా స్పెషల్ సాఫ్ట్‌వేర్‌తో మోడలింగ్ చేసి ప్రింటర్ సాయంతో తయారు చేస్తారు.

డిజిటల్ మోడల్స్‌ను స్మార్ట్ డివైస్‌లలో కూడా భద్రపరచుకోవచ్చు. అంటే కేవలం ఒక ఫోటో మాత్రమే కాకుండా, ఆ ఫోటో ఆధారంగా మీకో ప్రత్యేక విగ్రహాన్ని కూడా గుర్తుగా ఉంచుకోవచ్చు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *