High Court: జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు దగ్గర ఉన్న రూ.100 కోట్ల విలువైన స్థలానికి సంబంధించిన కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) మరియు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ & అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA)లకు హైకోర్టు వివరాలు ఇవ్వాలని ఆదేశించింది.
కౌంటర్ దాఖలుకు ఆదేశం
ఈ స్థలానికి సంబంధించి తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని హౌసింగ్ సొసైటీని హైకోర్టు ఆదేశించింది. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత, తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.

