Pakistan: మీరు చూసింది నిజమే.. మూడేండ్ల చిన్నారి కోర్టుకు ఎందుకు వెళ్లింది? అన్న అనుమానమే కదా మీకు. పాలకులు పాలనను మరిచి, పాలితులు బాధ్యతలు మరిస్తే జీవనమే గగనమవుతుంది.. జనజీవనమే స్తంభించిపోతుంది. ఈ దశలో ఎవరూ ముందుకు రాకపోవడంతో ఓ చిన్నారి స్పందించి ఏకంగా కోర్టుకే వెళ్లింది. తనతోపాటు తన చుట్టూ ఉన్న వారి సమస్యను తీర్చండి అంటూ జడ్జికి విన్నవించుకున్నది.
పాకిస్థాన్ దేశంలోని లాహోర్ నగరంలో సఖీరా అనే మూడేండ్ల చిన్నారి తన కుటుంబంతోపాటు జీవిస్తున్నది. నగరంలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరిందని, ప్రభుత్వ వైఫల్యం వల్ల గాలి నాణ్యత అత్యంత ప్రమాదకరంగా మారిందని ఆ బాలిక పంజాబ్ ప్రావిన్స్‌లోని కోర్టును ఆశ్రయించింది. దీనిపై పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆ చిన్నారి కోర్టును కోరింది.
ఇది కూడా చదవండి: Saudi Arabia: చరిత్రలోనే తొలిసారి… ఎడారిలో మంచు
చూశారా.. పాలకులు నిద్రపోతుంటే, పాలితులు బాధ్యతలను విస్మరిస్తే, ఓ చిన్నారి తన కర్తవ్యంగా భావించి కోర్టు మెట్లెక్కింది. శభాష్ సఖీరా. నీ చైతన్యం పాలకులకు, ప్రజలకు కనువిప్పు కలగాలి.