Crime News: మంచిర్యాల జిల్లాలో ఘోరం జరిగింది. ప్రేయసి మృతిని తట్టుకోలేక ప్రియుడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొర్విచల్మ గ్రామానికి చెందిన దుంపటి అంజన్నకు కూతురు హితవర్షిణి (20), కుమారుడు ఉన్నారు. హితవర్షిణి ఘట్‌కేసర్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతోంది.
ఆమెకు అదే గ్రామానికి చెందిన వినయ్‌తో పరిచయం ఏర్పడగా అది కాస్త ప్రేమగా మారింది. ఇటీవల సెలవులు ఉండటంతో తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది హితవర్షిణి. సోమవారం తిరిగి కాలేజీకి వెళ్లడానికి ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయలు దేరి సికింద్రాబాద్ చేరుకుంది హితవర్షిణి. అయితే అక్కడ రాత్రి 7.40 గంటల టైమ్ లో ఆమె లవర్ వినయ్‌తో ఫోన్‌లో మాట్లాడింది. అనంతరం హితవర్షిణి ఘట్‌కేసర్-బీబీనగర్ రైల్వేస్టేషన్ల ప్రాంతంలోని మాధవరెడ్డి వంతెన వద్ద రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. జీఆర్పీ పోలీసులు ఆమె డెడ్ బాడీని స్వాధీనం చేసుకుని ఆమె వద్ద లభ్యమైన కళాశాల ఐడీ కార్డు, ఆధార్ కార్డు, సెల్‌ఫోన్ ఆధారంగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని తెలియజేశారు.
ఇది కూడా చదవండి: Chili Paneer: రెస్టారెంట్ స్టైల్ చిల్లీ పనీర్ రెసిపీ: ఇలా ట్రై చేయండి!
డెడ్ బాడీని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే వినయ్ కు తెలియడంతో వినయ్ మనస్తాపానికి గురయ్యాడు. లక్షెట్టిపేట మండలంలోని కొత్త కొమ్ముగూడెం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే హితవర్షిణి కేసును దర్యాప్తు చేపట్టే క్రమంలో సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులకు ఆమె చివరగా వినయ్‌కు ఫోన్ చేసినట్లుగా తేల్చారు. విచారణలో అతను కూడా ఆత్మహత్యకు పాల్పడిన విషయం బయటపడింది. వినయ్ ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్‌ను బట్టి వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని పోలీసులు తేల్చారు. వినయ్ తల్లి రాజవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు లక్షెట్టిపేట ఎస్సై గోపతి సురేష్ పేర్కొన్నారు. .

