Bigg Boss 9 Telugu: తెలుగు ప్రేక్షకుల కోసం అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూసే రియాలిటీ షో బిగ్‌బాస్ కొత్త సీజన్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటివరకు 8 సీజన్ల విజయవంతమైన ప్రయాణం తర్వాత, బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం సాయంత్రం 7 గంటలకు అట్టహాసంగా ప్రారంభమైంది. హోస్ట్ నాగార్జున ఈసారి మరింత ఎంటర్టైన్మెంట్, కొత్త కాన్సెప్ట్‌లు, ఊహించని ట్విస్టులతో ఈ సీజన్ ప్రత్యేకంగా ఉండబోతుందని తెలిపారు.
ఈసారి సెలబ్రిటీలతో పాటు 6 మంది సామాన్యులు కూడా బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టారు. మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.
కంటెస్టెంట్స్ లిస్ట్:
-
తనూజ పుట్టస్వామి – ముద్ద మందారం సీరియల్ ఫేమ్ నటి. తాజాగా కుకు విత్ జాతిరత్నాలు షోలో కూడా కనిపించింది.
-
ఆశా షైనీ (ఫ్లోరా షైనీ) – నువ్వు నాకు నచ్చావ్, నరసింహ నాయుడు చిత్రాల హీరోయిన్. ఈ షోతో రీఎంట్రీ.
-
సోల్జర్ కళ్యాణ్ – ఆర్మీ ఉద్యోగి. అగ్నిపరీక్షలో విజేతగా నిలిచి హౌస్‌లో అడుగుపెట్టిన మొదటి కామనర్.
-
జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ – జబర్దస్త్ కమెడియన్, కుకు విత్ జాతిరత్నాలు ఫేమ్.
5. శ్రష్టి వర్మ – ప్రముఖ కొరియోగ్రాఫర్. సినిమాల నుంచి బిగ్‌బాస్ హౌస్ వరకు ప్రయాణం
6. హరిత హరీష్ (మాస్క్ మ్యాన్) – అగ్నిపరీక్ష జ్యూరీ బింధు మాధవి ఎంపిక చేసిన కామనర్.
7. భరణి – స్రవంతి సీరియల్ నటుడు. హౌస్‌లో అడుగుపెట్టిన వెంటనే జరిగిన డ్రామా సోషల్ మీడియాలో హాట్ టాపిక్.
8. రీతూ చౌదరి – జబర్దస్త్ ద్వారా పేరుపొందిన కమెడియన్.
9. డిమాన్ పవన్ – మరో కామనర్. అగ్నిపరీక్ష ద్వారా ఎంపిక.
10. సంజన గల్రానీ – బుజ్జిగాడు హీరోయిన్. తనపై పడిన విమర్శలను తుడిచివేయాలనే సంకల్పంతో ఈ షోలోకి.
11. రాము రాథోడ్ – సోషల్ మీడియాలో వైరల్ అయిన రాను బొంబయికి రాను పాట ఫేమ్ సింగర్.
12. శ్రీజ దమ్ము – నవదీప్ ఎంపిక చేసిన కామనర్. విజయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నది.
13. సుమన్ శెట్టి – జయం సినిమా కమెడియన్. పలు భాషల్లో నటించిన అనుభవజ్ఞుడు.
14. ప్రియశెట్టి – ఆడియన్స్ ఓటింగ్ ద్వారా ఎంపికైన కామనర్.
15. మర్యాద మనీష్ – జ్యూరీ అభిజిత్ ఎంపిక చేసిన చివరి కంటెస్టెంట్.
ఈ సీజన్‌లో బిగ్‌బాస్ నియమాలు మరింత కఠినంగా ఉండబోతున్నాయని నాగార్జున ముందే హెచ్చరించారు. సెలబ్రిటీలు, సామాన్యులు సమాన స్థాయిలో పోటీ పడే ఈ షోలో ప్రేక్షకులను అలరించే ఎమోషనల్ క్షణాలు, ఎంటర్టైన్మెంట్ మోమెంట్స్, స్ట్రాటజీ గేమ్స్ అన్నీ ఉండబోతున్నాయి.
బిగ్‌బాస్ హౌస్‌లో మొదటి వారం నుంచే కంటెస్టెంట్స్ మధ్య కాంపిటేషన్ గట్టిగానే ఉంటుందని షో టీమ్ తెలిపింది. ఈ సీజన్‌లో ఎవరు గెలుస్తారు? ఎవరు స్టార్‌గా నిలుస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది.