Krish-Pawan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మరోసారి చేతులు కలపనున్నారా? “హరిహర వీరమల్లు” మిస్ అయిన క్రిష్, తాజాగా “ఘాటి” ప్రమోషన్స్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు ఏంటి? పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Dhanush: మీనాక్షితో ధనుష్ రొమాన్స్?
“హరిహర వీరమల్లు” చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో పనిచేసిన క్రిష్ జాగర్లమూడి, వ్యక్తిగత కారణాలతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. క్రిష్ దాన్ని వదులుకోవడం ఆయన అభిమానులను నిరాశపరిచింది. అయితే, “ఘాటి” ప్రమోషన్స్‌లో మాట్లాడుతూ, పవన్‌తో మళ్లీ కలిసి పనిచేయాలనే తన కోరికను వ్యక్తం చేశారు. భవిష్యత్తులో బలమైన కథతో పవన్‌తో సినిమా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ప్రస్తుతం “ఘాటి” సెప్టెంబర్ 5న రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. క్రిష్-పవన్ కాంబినేషన్ మళ్లీ సెట్స్‌పైకి ఎప్పుడు వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

