Earthquake

Myanmar Earthquake: రెండు రోజులో.. మూడు భూకంపలు

Myanmar Earthquake: మయన్మార్‌లో వరుసగా భూకంపాలు వాస్తు భయాందోళనలు సృష్టిస్తున్నాయి. గురువారం (సెప్టెంబర్ 4) ఉదయం 11:03 IST సమయానికి 4.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకటించింది. ఈ ప్రకంపనలు భూమి ఉపరితలానికి 120 కిలోమీటర్ల లోతులో నమోదయ్యాయని అధికారులు తెలిపారు.

అదే రోజు ఉదయం 9:52 IST సమయంలో మరోసారి 4.1 తీవ్రతతో భూకంపం మయన్మార్‌ను తాకింది. ఇది 70 కిలోమీటర్ల లోతులో చోటుచేసుకుంది. అంతకుముందు బుధవారం (సెప్టెంబర్ 3) మధ్యాహ్నం 3.7 తీవ్రతతో మరో భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. వరుస ప్రకంపనలతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

తక్కువ లోతు భూకంపాల ముప్పు

తక్కువ లోతులో సంభవించే భూకంపాలు ఎక్కువ ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. అలాంటి భూకంపాల ప్రకంపనలు ఉపరితలానికి తక్కువ దూరం ప్రయాణించడం వల్ల ఎక్కువ నష్టం కలిగించే అవకాశం ఉంటుంది.

మార్చి నెల భూకంపాల ప్రభావం

ఇక మార్చి 28న మధ్య మయన్మార్‌ను 7.7 మరియు 6.4 తీవ్రతలతో భారీ భూకంపాలు కుదిపివేసిన విషయం తెలిసిందే. ఆ ప్రభావిత ప్రాంతాల్లో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రస్తుతం TB, HIV, వెక్టర్ మరియు నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల ముప్పు వేగంగా పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది.

భూకంపాలకు కారణం

మయన్మార్ భౌగోళికంగా భూకంపాలకు అత్యంత సున్నిత ప్రాంతం. ఇండియన్, యురేషియన్, సుండా, బర్మా టెక్టోనిక్ ప్లేట్ల మధ్య ఇరుక్కుపోయిన ఈ దేశం క్రియాశీల భౌగోళిక ప్రక్రియలకు గురవుతోంది. సుమారు 1,400 కిలోమీటర్ల సాగింగ్ ఫాల్ట్ లైన్ ఈ దేశంలో గుండా వెళ్తూ, సాగింగ్, మండలే, బాగో, యాంగోన్ నగరాలకు తీవ్ర భూకంప ప్రమాదాన్ని కలిగిస్తోంది. యాంగోన్ ఫాల్ట్ లైన్‌కి దూరంగా ఉన్నప్పటికీ, దాని అధిక జనాభా కారణంగా ఎక్కువ ముప్పు ఎదుర్కొంటోంది.

1903లో బాగోలో సంభవించిన 7.0 తీవ్రతతో కూడిన భూకంపం కూడా యాంగోన్‌ను తీవ్రంగా ప్రభావితం చేసినట్లు చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం వరుస ప్రకంపనలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *