Rajanna Sircilla: కొడుకు చేసిన అప్పు తిరిగివ్వలేదని అతని తల్లి కిడ్నాప్ చేసిన దారుణ ఘటన తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకున్నది. ఆ తల్లిని బలవంతంగా కారులోకి లాగి తీసుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శాంతిభద్రతలనే ప్రశ్నార్థకం చేస్తున్న ఇలాంటి ఘటనలు తెలంగాణలో తరచూ చేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తున్నది.
Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మండలం కొడుముంజ గ్రామానికి చెందిన పల్లపు శ్రీనివాస్ చెరకు కోత కూలీలకు మేస్త్రీగా పనిచేస్తున్నాడు. అతను మహారాష్ట్రకు చెందిన లాల్ దేవకర్ అనే రైతు వద్ద చెరుకు కోత కోసం శ్రీనివాస్ 3 లక్షల రూపాయలను అడ్వాన్స్‌గా తీసుకున్నాడు.
Rajanna Sircilla: అయితే కూలీలు రాకపోవడం, డబ్బు తిరిగివ్వకపోవడంతో ఇటీవల లాల్ దేవకర్, శ్రీనివాస్ మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగింది. దేవకర్ అనుచరులు బుధవారం కొడుముంజ గ్రామానికి వచ్చి శ్రీనివాస్ భార్య, అతడి కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ఇదే సమయంలో వారిని వారించిన శ్రీనివాస్ తల్లి పల్లపు భీమాబాయిని దేవకర్ అనుచరులు బలవంతంగా కారులోకి ఎక్కించుకొని వెంట తీసుకెళ్లారు. ఈ విషయం గురువారం వెలుగులోకి వచ్చింది.
Rajanna Sircilla: ఈ ఘటనపై శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పు కోసం ఓ మహిళను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన ఘటన సంచలనంగా మారింది. వేములవాడ ప్రాంతంలో కలకలం రేపింది.