Deeksha Panth: బిగ్ బాస్ తెలుగు సీజన్ 1తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి దీక్షా పంత్ సినీ పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె చేసిన కాస్టింగ్ కౌచ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి.
వరుడు సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టిన దీక్షా, రచ్చ, సోగ్గాడే చిన్ని నాయన వంటి పలు చిత్రాల్లో నటించారు. బిగ్ బాస్ తర్వాత దాదాపు 8 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని ఒప్పుకున్నారు. అవకాశాల కోసం ఒత్తిడి ఎదుర్కొన్నానని, అయితే తాను దేనికీ లొంగలేదని స్పష్టం చేశారు. అదే సమయంలో, “ఒక నటుడు, నిర్మాత లేదా దర్శకుడి మధ్య పరస్పర ఒప్పందం ఉంటే, అందులో తప్పేముంది?” అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఆమెను విమర్శల పాలు చేశాయి.
Also Read: SV Krishna Reddy: ఎస్వీ కృష్ణారెడ్డి 43వ చిత్రం వేదవ్యాస్ గ్రాండ్ ఓపెనింగ్!
క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొనే ఒక తీవ్రమైన సమస్య. దీక్షా పంత్ లాంటి ఒక నటి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. కొంతమంది ఆమె వ్యాఖ్యలను సమర్థించినప్పటికీ, మెజారిటీ ప్రజలు మాత్రం ఆమె అభిప్రాయాన్ని తప్పుబడుతున్నారు. ఈ వివాదాస్పద కామెంట్స్ కారణంగా ఆమె పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
తన కెరీర్‌లో పూర్తి సక్సెస్ సాధించలేకపోయానని దీక్షా పంత్ ఒప్పుకున్నారు. క్యాస్టింగ్ కౌచ్‌కి ఒప్పుకోకపోవడం వల్ల కొన్ని మంచి అవకాశాలు కోల్పోయానని చెప్పారు. ప్రస్తుతం ఆమె మోడలింగ్‌పై దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఈ తాజా వివాదంతో దీక్షా పంత్ మరోసారి వార్తల్లో నిలిచారు.

