America: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ కు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచారు. ఎక్కడో ఏదో జరిగితే ఇంకెక్కడో రియాక్షన్ జరుగుతుందని ఓ సినిమాలో చెప్పిన డైలాగ్ ఇప్పుడు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. డోనాల్డ్ ట్రంప్ విజయంతో ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా షేర్లు ఎగబాకాయి.
ఎన్నికల్లో ట్రంప్ హవా కొనసాగుతున్న క్రమంలో బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్ లో టెస్లా షేర్లు 14 శాతం వృద్ధి చెందాయి. మరో పక్క అమెరికాలోని ఇతర ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు రివియాన్ 8 శాతం, లూసిడ్ గ్రూపు 4 శాతం, చైనా కేంద్రంగా పని చేస్తున్న ఎన్ఇఓ 5.3 శాతం నష్టపోయాయి.
తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే ఎలాన్ మస్క్‌ను ప్రభుత్వ ఎఫిషియెన్సీ కమిషన్ సారధిగా నియమిస్తానని కూడా ట్రంప్ ప్రకటించారు. దీంతో ఆయన అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం కృష్ణా చీరలు భారీగా పెరగడం అన్ని చకచకా జరిగిపోయాయి.
కాగా,రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు మ్యాజిక్ ఫిగర్ 270ని దాటడంతో ట్రంప్ గెలుపు ఖరారైంది. 277లకమైన స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్ దే పైచేయి అయింది. ట్రంప్ కు 277 ఎలక్టోరల్ ఓట్లు రాగా, కమలా హారిస్ 224 ఓట్లు సాధించారు.