Revanth Reddy

Revanth Reddy: మళ్లీ ఓయూకు వస్తా.. ఆర్ట్స్‌ కాలేజ్‌ ముందు మీటింగ్‌ పెడతా

Revanth Reddy: ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనలో సీఎం రేవంత్‌ రెడ్డి పలు కీలక హామీలు, వ్యాఖ్యలు చేశారు. యూనివర్సిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎలాంటి వెనుకంజ వేయదని, రూ. వెయ్యి కోట్ల నిధులు కేటాయించనున్నట్లు ప్రకటించారు.

అభివృద్ధి పనులపై స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ కోసం ఇంజినీర్ల కమిటీని ఏర్పాటు చేయాలని విద్యాశాఖ మంత్రికి సీఎం ఆదేశించారు.

“మళ్లీ ఓయూకు వస్తా”

రేవంత్‌ మాట్లాడుతూ – “నేను మళ్లీ ఓయూకు వస్తా.. ఆర్ట్స్‌ కాలేజ్‌ ముందు మీటింగ్‌ పెడతా. ఆ రోజు ఒక్క పోలీస్‌ కూడా క్యాంపస్‌లో ఉండరు. ఎవరి అభిప్రాయం వాళ్లు స్వేచ్ఛగా చెప్పొచ్చు” అని హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Harish Rao: ఆశా వర్కర్లవి గొంతెమ్మ కోరికలు కావు మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజం

డిసెంబర్‌లో బహిరంగ సభ

తెలంగాణ రాష్ట్ర ప్రకటన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ – “డిసెంబర్‌లో మీటింగ్‌ పెట్టండి. ఏం కావాలో విద్యార్థులు రాసిపెట్టండి.. అదే రోజు అక్కడికక్కడే జీవోలు ఇస్తా” అని ప్రకటించారు.

కోదండరామ్‌పై కుట్ర ఆరోపణ

ప్రొఫెసర్‌ కోదండరామ్‌ విషయాన్ని ప్రస్తావించిన సీఎం – “ఆయనను MLC చేయకుండా కుట్రలు జరిగాయి. ఢిల్లీ వరకు వెళ్లి ఆయనపై అడ్డంకులు సృష్టించారు. కానీ నా హామీ స్పష్టంగా ఉంది.. 15 రోజుల్లో కోదండరామ్‌ గారిని MLCగా పంపిస్తా” అని తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  September 1st Changes: సెప్టెంబర్‌ 1 నుంచి మారిన కీలక మార్పులు ఇవే.. డోన్ట్ మిస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *