Pawan Kalyan

Pawan Kalyan: వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న బాలకృష్ణ.. స్పందించిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: తెలుగు సినీ పరిశ్రమలో ‘గాడ్ ఆఫ్ మాసెస్’గా గుర్తింపు పొందిన నందమూరి బాలకృష్ణ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. సినీ హీరోగా 50 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్) గోల్డ్ ఎడిషన్ గుర్తింపును బాలయ్యకు ప్రదానం చేసింది. భారతీయ సినీ చరిత్రలో ఈ గుర్తింపు పొందిన తొలి నటుడిగా ఆయన చరిత్ర సృష్టించారు.

ఈ అసాధారణ ఘనతను పురస్కరించుకుని ఆగస్టు 30న హైదరాబాద్‌లో బాలకృష్ణకు ప్రత్యేక సన్మాన కార్యక్రమం జరగనుంది. సినీ పరిశ్రమ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు ఈ వేడుకలో పాల్గొననున్నారు.

ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌ శుభాకాంక్షలు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియాలో స్పందిస్తూ –

“నందమూరి తారక రామారావు గారి నట వారసుడిగా బాలనటుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టి, జానపదాలు, కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఐదు దశాబ్దాలుగా హీరోగా నిలిచిన బాలకృష్ణ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందడం గొప్ప విషయమని భావిస్తున్నాను. ఆయన నటనతో పాటు ప్రజాసేవలో కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Revanth Reddy: 20 ఏళ్ల తర్వాత ఓయూకు సీఎం.. నేడు ఉస్మానియా యూనివర్శిటీకీ రేవంత్ రెడ్డి

చంద్రబాబు ప్రశంసలు

టీడీపీ అధినేత చంద్రబాబు కూడా బాలకృష్ణను అభినందించారు. సోషల్ మీడియాలో రాసుకొచ్చిన సందేశంలో –

“బాలయ్య 50 ఏళ్ల సినీ ప్రయాణం భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. తరతరాలుగా ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్న ఆయన అంకితభావం, కృషి వల్లే ఇంతకాలం లీడ్ హీరోగా కొనసాగగలిగారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు ఆయన అసాధారణ ప్రయాణానికి నిదర్శనం” అని కొనియాడారు.

అభిమానుల సంబరాలు

బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రయాణం గుర్తింపుతో అభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గౌరవం పొందడం బాలయ్య ప్రతిభకు నిదర్శనమని అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *