Tirumala News:తిరుమల శ్రీవారి భక్తుల కోసం దర్శనం టికెట్లను ఆగస్టు 25వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విడుదల చేయనున్నది. నవంబర్ నెలకు సంబంధించి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను అదేరోజు మధ్యాహ్నం విడుదల చేయనున్నది. అదే సమయంలో వసతి బుకింగ్ కూడా ఓపెన్ కానున్నది. ఇప్పటికే ఆగస్టు 22న దివ్యాంగుల కోటా టికెట్లను టీటీడీ విడుదల చేసింది. టికెట్ల విషయంలో భక్తులు దళారులను నమ్మవద్దని, టీటీడీ అధికార వెబ్‌సైట్‌లో యాప్‌లోనే టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు తెలిపారు.
Tirumala News:ఇదిలా ఉండగా, తిరుమలలో తాజాగా భక్తుల రద్దీ తగ్గింది. ఉదయం 8 గంటల తర్వాత దర్శనానికి వెళ్లే టోకెన్ లేని భక్తులకు 5 గంటల వరకు సమయం పడుతుంది. ఈ సమయంలో నేరుగా వెళ్లి స్వామివారిని దర్శించుకునే అవకాశం కలుగుతుంది. ఆగస్టు 23న స్వామివారిని 83,858 మంది దర్శించుకోగా, 26,034 మంది తలనీలాలను సమర్పించారు. ఆ ఒక్కరోజే స్వామివారికి రూ.3.93 కోట్ల ఆదాయం సమకూరిందని టీటీడీ వెల్లడించింది.